అదేంటో లైఫ్ లో అపుడపుడు భయం వేస్తుంటుంది … ఎం.సి.ఏ. చదివి మూడు సంవత్సరాలు అయిందా … కాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది … భాగ్యనగరంలోనే జాబు … ఈ మూడు సంవత్సరాలు లోను మూడు ప్రాజెక్ట్స్ … మాములుగా అయితే ఒకే ప్రాజెక్ట్ లో ఉంటే అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ వస్తుంది … ప్రతి ఒక్కడు అడుగుతాడు … ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు అని … ఎవరయినా బందువుల ఇంటికి వెళ్తే మనల్ని వేరే వాళ్లతో పోల్చడం మొదలుపెడతారు … మా వాడు అమెరికా వెళ్ళాడు … నలబయ్ లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్నాడు అని … మనం ఎప్పడు వెళ్తాం అనిపిస్తుంది … వచ్చే మే కి ఇరవయ్ ఆరు సంవత్సరాలు నిండుతాయి … బావ చెప్పినట్టు పెళ్లి అంటు చేసుకుంటే ఇరవయ్ ఏడు లోనే చేసుకోవాలి … ఇప్పటి వరకు మనకి ఎవరు ప్రపోజ్ చెయ్యలేదు … మనం ఒక అమ్మాయిని ఇష్టపడ్డం జరిగింది … కానీ ఏం లాభం … తను కూడా ఇష్టపడాలి కదా … అలా అయింది … మొన్న అన్నయ్య పెళ్లి అయింది … ఒక్క అమ్మాయి రాలేదు … ఛీ … ఛీ … ప్రతి వారం స్వాతి చదువుతాను … సరసమయిన కథ వదలకుండా … వయసు వల్ల అయితేనేమి … ఇటువంటి కథలు చదవడం వల్ల అయితేనేమి … అన్నయ్య కు పెళ్లి అయిపొయింది … ఇక నీకు లైన్ క్లియర్ అయిపోయినంటే అని అందరు అనడం వల్ల అయితేనేమి … ఎపుడెపుడు పెళ్లి చేసుకుంటామా అనిపిస్తుంది … అపుడెపుడో ఒక కథ చదివాను … అబ్బాయి అమ్మాయి కళ్ళల్లోకి చూస్తూ … రెండు చేతులతోనూ ఆమె తలను పట్టుకుని … దగ్గరగా … అంటే , వెచ్చటి ఊపిరి లు తెలిసేలా … తన పెదాలతో ఆమె ఎర్రని పెదవుల మీద సంతకం పెడతాడు … యెంత రొమాంటిక్ గ ఉందొ కదా … మరి మనకి ఎప్పుడు వస్తుందో ఆ ఛాన్స్ … రోడ్ మీద ఈ అమ్మాయి కనిపించినా తల ఆటోమాటిక్ గ అటు తిరిగిపోతుంది … సో, కాస్త భయపడడం లో అర్థం ఉంది కదా …
జాగ్రత్త నేస్తం !
hahahaha… jagratha nestam.
Ravi i never expect that you think about girls in this way, at that time we are in degree i and rama reddy talk about girls but at that time you are not that much involved now i see a different ravi ….. who brings this change