ఎంత తేడా !!! సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఎలా ఉండేది … ఇప్పుడు ఎలా ఉంది … క్లాసులు అయిన తరువాత ఫ్రెండ్స్ అందరం రోడ్డు మీద కబుర్లు చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం … ట్రాఫిక్ అసలు ఉండేది కాదు … మరి ఇప్పుడో , ఇది మరో అమీరపేట్ లా తయారయింది … ఆర్. ఎస్ అన్నదమ్ములు, కళానికేతన్, కళామందిర్, జే. సి. అన్నదమ్ములు, ఇంకా చాలా చాలా షాపింగ్ మాల్స్ వచేసాయి … ఇవి చాలవు అన్నట్లు రోడ్ ప్రక్క బళ్ళమీద ఉండేవి ఎలాను ఉంటాయి … చాల ఇంజనీరింగ్ కాలేజీలు చుట్టుప్రక్కల ఉండటంతో అమ్మాయిల హాస్టల్స్ వచ్చేశాయి … శనివారం, ఆదివారం సాయంత్రాలు అలా వెళ్లి చూడు మామా … కళ్ళకు పండగే … అందంగా తయారయి … ఫ్రెండ్స్ ని వేసుకుని షాపింగ్ చేసేస్తూ ఉంటారు … కొంతమంది వాళ్ల బాయ్ ఫ్రెండ్స్ తోను, కొంతమంది వాళ్ల శ్రీవారి తోను …. అలా అలా … బైక్ మీద కుర్చుని … నడుం మీద చేయి వేసి … అబ్బాఎప్పుడు వస్తుంది ఆ అదృష్టం … ఏ అమ్మాయిని చూసినా బావుంటుంది … అలా చూడటం తప్పా ?? ఏం కాదు … ఈ ట్రాఫిక్ కు కారణం ఏమిటి అంటే … జే.యెన్.టి.యు నుండి హై టెక్ సిటీ కి రోడ్డు పడడం … ఇళ్ళ అద్దెలు అమాంతం పెరిగిపోయాయి … ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోయాయి … మనల్ని కూడా … ఒక అందమయిన, మంచి అమ్మాయి ఇష్టపడి, ఇద్దరి మధ్యా మంచి నమ్మకం ఉండి … సరదాగా అలా అలా తిరిగి , పెళ్లి చేసుకుంటే యెంత బావుండును … నాకు అనిపిస్తుంది … ఈ జన్మకు ఆ అదృష్టం లేదు ఏమో … అదేంటో పెద్దలు కుదిర్చిన పెళ్లి మీద నాకు అంత మంచి అభిప్రాయం లేదు … ఎందుకంటే … అమ్మాయి గురించి అబ్బాయికి తెలియదు … అతని గురించి ఆమెకు తెలియదు … ఫొటోలతో మొదలవుతుంది … పెళ్లి చూపులలో ఒక అరగంట మాట్లాడుకోనిస్తారు … ఒక మనిషిని అరగంట లో అర్థం చేసుకోవడం జరుగుతుందా ?? అయినా సరే పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు ఎలా నిలవగలుగు తున్నాయి ? … బహుశా … పెళ్లి అయిన తరువాత … ఏమో మనకు అర్థం కాదు … నన్ను ఎవరు అయినా అర్థం చేసుకోవడం కష్టం అని నా మీద నాకు ఉన్న అభిప్రాయం … మరి మనకి ఏమి జరుగుతుంది … బావ కి జాతకం మీద నమ్మకం ఎక్కువ … నా జాతకం చూసాడు … నీది పెద్దలు కుదిర్చిన పెళ్లి రా అన్నాడు … పెళ్లి తరువాత నా లైఫ్ మారిపోతుందట … నిండు వెన్నెలలో , ఆరు బయట పడుకుంటే యెంత హాయిగా ఉంటుందో , నీ లైఫ్ అంట హాయిగా సాగిపోతుంది అన్నాడు … తను చందమామ అంత అందంగా ఉంటుందట … బావ ఈ మాట ఎప్పుడు చెప్పినా నా మనసు బజాజ్ – పల్సర్ మీద పరుగెడుతుంది …
చూడాలి మరి … ఏమి అవుతుందో …
Leave a comment