కృష్ణ ప్రసాద్ ఒక సాఫ్టువేరు ఇంజనీర్ … కవితలు రాయడం ఆయన హాబీ … అందులో కొన్ని …
మాటలలో చెప్పజాలనిది ,
మౌనంగా ఉండనీయనిది ,
చేతలలో చూపలేనిది,
ఏమిచేసినా తనివి తీరనిది,
క్షణమునే యుగం చేసేది,
క్షణమయినా గడవనీయనిది,
గుండె చప్పుడు మించిపోయేది,
గుండెనే పిండివేసేది
ఏ రూపమయినా నేను చూసేది,
నీ రూపమే గుర్తు చేసేది,
ఇన్ని భావాలు కలిగించేది,
ఎలా పలికినా బాగున్నదనిపించేది,
రెండు అక్షరాలతో ఎంతో అర్థాన్ని ఇచ్చేది,
ఈ లోకాన అందరికి నచ్చేది,
ప్రేమ ... ప్రేమ ... ప్రేమ ...
ప్రేమ ... ప్రేమ
ప్రేమ
Leave a comment