బావ …

దేవతలు మూడుకోట్లమంది అని ఎవరైనా అంటే నాకు చప్పున కోపం వచేస్తుంది … బహుశా వాళ్ళకు బావ గురించి తెలియదు అనుకుంటాను … అందుకే తనను కలపలేదు … రాముడు కూడా మనిషే … కానీ రాముడి గుణగణాల వల్ల, క్యారెక్టర్ వల్ల రాముడిని దేవుడు అంటారు అని ఎక్కడో చదివాను … అందుకే రాముడిని ఆదర్శ పురుషుడు అన్నారట … మరి బావకు రాముడి కన్నా ఏమి తక్కువ ?? తనకు కోపం, చిరాకు రావడం ఇప్పటివరకు నేను చూడలేదు అంటే అది అతిశయోక్తి కాదు … మావయ్యగారికి వంట్లో బాగా లేకపొతే ఎంత కంగారు పడ్డాడు … ఏ విషయం అయినా అరటిపండు వలిచినట్లు చెబుతాడు … నాకు ఇప్పటివరకు ఎంత హెల్ప్ చేసాడని … అసలు ఈ రోజు అన్నయ్య, నేను ఇలా ఉన్నామంటే అది బావ వల్ల కాదూ … మా చదువుల కోసం హైదరాబాద్ రమ్మని చెప్పకపోతే చరిత్ర మరోలా ఉండేది … తనకు జెలసి ఉండదు … జీవితాన్ని ఎంజాయ్ చెయ్యడం తెలుసు … తను వంట వండుతాడు … చికెన్ అయినా, మటన్ అయినా, చేప ఆయినా, కాకర కాయ అయినా అదిరిపోవాల్సిందే … ఇప్పటికి ఇంతే … ముందు ముందు మరి కొంత …

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑