ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు … ఎలాగా అని ఆలోచిస్తున్నాను … అసలు ప్రేమంటే ఏంటి ? … వ్యామోహమా … ఆకర్షణా … అర్థం చేసుకోవడమా … ఇంకా ఏమన్నానా ??? … అది చిన్న వయసులో మొదలవుతుందా … లేక ఈ టైములో పుడుతుంది అని ఏమి అన్నా ఉందా ??? స్నేహం ప్రేమగా మారవచ్చా, లేక అలా మారడం తప్పా? … ఎక్కడో చదివాను … కొంతమంది ప్రేమించడం, లేదా ప్రేమించబడడం కన్నా తాము ప్రేమలో ఉన్నాము అన్నా ఫీలింగ్ నే ఇష్టపడతారట … మా బావ అపుడెపుడో చెప్పాడు … ప్రేమంటేనే నిజం … ఇక నిజమయిన ప్రేమ, అబద్దమయిన ప్రేమ ఎక్కడయినా ఉంటాయా ? అని. ” నిప్పు అంటేనే కాలేది … ఇక కాలే నిప్పు, కాలని నిప్పు ఉండవు అని ” … మరి అది నిజమయితే కొంతమంది కొంతకాలం కలిసి తిరిగి, రాత్రి పూట గంటలు, గంటలు మాట్లాడుకుని, అందరి లోను తాము ప్రేమలో ఉన్నాము అన్నఫీలింగ్ కలిగించి , కొంతకాలం తరువాత విడిపోతారు … అంటే వారిది ప్రేమ కాదా ? … అసలు ఒకరిని ప్రేమించి, వేరొకరిని పెళ్లి చేసుకోవడం కరెక్టేనా ? …
…
…
నాకు తెలిసి ఎవరూ ప్రేమ ఇదీ అని నిర్వచనం ఇవ్వలేరు … ఇది అంతా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నా చుట్టూ ఉన్న చాలామంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం చేతా, చాలా మంది ప్రేమలు విఫలం అవ్వడం చేతా, నేను కూడా ప్రేమిస్తున్నాను అన్న ఫీలింగ్ లో ఉండడం చేతా … ప్రేమ అంటే కేవలం మానసికమా , లేక శారీరకం కూడానా ? … ఏమో … నేను ఏమి అనుకుంటున్నాను అంటే ప్రేమ ఆకర్షణ తోనే మొదలవుతుంది , ఈ ఆకర్షణ అందం కావచ్చు … లేక అవతలి వారిలో టాలెంట్ కావచ్చు … సరే, ఒకడున్నాడు , ఒక అందమయిన అమ్మాయిని చూసాడు … ఇద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తారు … ఇద్దరికీ పరిచయం ఉంది … అమ్మాయి నచ్చింది … నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు … కాని ఆ అమ్మాయికి వీడి మీద అటువంటి ఫీలింగ్స్ ఏమి లేవు … ఇక్కడ వాడికి ప్రేమేనా ? … ప్రేమ అంటే రెండు వైపులా నుండి ఉండాలి కదా !!! వీడికి నచ్చినంత మాత్రాన అది ప్రేమ అయిపోతుందా ??? … సరే, ప్రేమ గురించి మాట్లాడడానికి మనం సరిపోము … ఇక్కడితో వదిలేద్దాం …
…………
కొంత వయసు వచ్చిన తరువాత మనసు, శరీరం తోడు కోరుకుంటాయి … చిన్నప్పుడు ఈ ఫీలింగ్స్ ఏమి ఉండవు కాని…తరువాత తరువాత మొదలవుతాయి…మన ఫీలింగ్స్ పంచుకోవడానికి, మన బాగోగులు చూడడానికి ఎవరైనా ఉంటే ఎంత బాగుండును అనిపిస్తుంది … ఎక్కడో చదివాను, పెళ్ళంటే ఒక ఆడ, మగా కలిసి ఉండడానికి సమాజం విధించిన కట్టుబాటు అని…పెళ్లి అయిన తరువాత లైఫ్ స్టైల్ మారిపోతుంది … మనం ఇంకా బాధ్యతగా ఉండాలి …
…
అదేంటో, ఈ మధ్య పెళ్లి గురించిన ఆలోచనలు పెరిగిపోతున్నాయి … ఇప్పటివరకు అనుకున్నాను నేను ఒక్కడినే ఇలా ఫీల్ అవుతున్ననా అని , కాని విషయం ఏమిటి అంటే, పవన్ గాడు, సాయి కిషోరు, ఇంకా చాల చాలా మంది నాలాగే ఆలోచిస్తున్నారు అని. కాని ఇంకో ప్రశ్న భయపెడుతూ ఉంటుంది … ఇప్పటి వరకు ఏమి సాధించాము … బ్యాంకు అకౌంటు లో డబ్బులు ఏమి ఉన్నాయి అని … ఇంకో వైపు, ఏ అందమయిన జంట ను చూసినా అనిపిస్తుంది … మనకూ ఇంత అందమయిన అమ్మాయి దొరుకుతుందా అని … భవిష్యత్తుని గురించి ఆలోచిస్తే వర్తమానాన్ని ఎంజాయ్ చేయలేం అంట … ఇది తెలిసి కూడా రేపటి గురించి ఎందుకు అలొచిస్తమో నాకయితే అర్థం కాదు …
…
అమ్మాయిలు కూడా జాబ్ చేస్తే వాళ్లకు ఆర్ధిక ఫ్రీడం ఉంటుంది … ఎవరి మీదా ఆధారపడవలసిన అవసరం ఉండదు … అపుడు అబ్బాయిలు తమ ఆధిపత్యం చూపించలేరు … అంటే అందరు అబ్బాయిలు చెడ్డ వారని కాదు … మా బావ లాంటి వాళ్లు కూడా ఉంటారు … కాని విషయం ఏంటి అంటే, మా ఆఫీసు లో చూస్తుంటాను కదా …. అమ్మాయిలు సాయంత్రం ఏడు, ఎనిమిది వరకు ఉంటారు … ఇంటికి వెళ్ళేసరికి అలసిపోతారు … అబ్బాయిలు ఎలాగు జాబ్ చేయాలి … ఇక ఇద్దరూ అలసిపోతే ఇంక ఏమి ఎంజాయ్ చేస్తారు … లైఫ్ అంటే డబ్బులు ఒక్కటే కాదు కదా … నా అభిప్రాయం తప్పు కావచు … బట్, నేను ఇలా ఫీల్ అవుతున్నాను …
…
బావ అన్నాడు, గాలి, నీరు, ఆకాశం ఎలాగో డబ్బు కూడా అలాగే … దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు అని … ఏమో … ఇంకొక విధమయిన ఫీలింగ్ తరుముతూ ఉంటుంది … మనతో పాటు చదివిన వాళ్లు, మన తోటి వాళ్లు విదేశాలు వెళ్లారు … మనము ఎప్పుడు వెళ్తాము అనిపిస్తుంది … ఎందుకంటే డబ్బుల కోసం … నాకు ఆ ఫీలింగ్ అంత ఎక్కువ లేదు అనుకో … ఎందుకంటే, మనకు లేని వాటిని గురించి ఆలోచిస్తే , మనకు ఉన్న వాటి విలువ తెలియదు … ఏది జరిగినా మన మంచికే అని నా నమ్మకం … కాబట్టి నేను ఆనందంగానే ఉన్నాను … అసలయిన భయం ఇంకొకటి ఉంది … అదేంటంటే … జుట్టు రాలిపోవడం … హైదరాబాద్ లో ఉండడం వలన, నాన్న కు బట్ట తల ఉండడం వలన, మనకు కూడా వస్తుందేమో అని భయం … మనం చూడడానికి బాగానే ఉంటాము … కాని రెండు సంవత్సరాల తరువాత … ఏమో … ఆ దేవుడికే తెలియాలి …
…
స్వాతి లో సరసమయిన కథలు ఉంటాయి కదా … రచయితలకు ఆ ఆలోచనలు ఎట్లా వస్తాయో … అమ్మాయిలను నుదురు నుండి పాదాల వరకు వర్నించేస్తుంటారు …. చిన్నప్పటి నుండి ఇటువంటి కథలు చదవడం వల్లనో ఏమో, అటువంటి అందమయిన అమ్మాయిని కోరుకుంటున్నాం … తప్పు లేదు కదా … ఉంటారు … ఎందుకో తెలియదు …. ఇటువంటి అందమయిన కథలు చదువుతూ … ఇంత అందమయిన అమ్మాయిలను చూతూ మామూలుగా ఉండడం అంటే మాటలు కాదు …
…కాలమే సమాధానం చెబుతుంది … చూద్దాం … ఎం జరుగుతుందో …
అమ్మాయిలు సాయంత్రం ఏడు, ఎనిమిది వరకు ఉంటారు … ఇంటికి వెళ్ళేసరికి అలసిపోతారు … అబ్బాయిలు ఎలాగు జాబ్ చేయాలి … ఇక ఇద్దరూ అలసిపోతే ఇంక ఏమి ఎంజాయ్ చేస్తారు …
still can enjoy if one is tired???