నా గురించి నేను . . .

మధ్య నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను అనుకుంటున్నానుఎవరి గురించి ?? నా గురించే ! ఎందుకంటే చాలా మంది, ఆఫీసు లోను, ఫ్రెండ్స్ కూడా నువ్వు కొంచం తేడా గాడివి అంటున్నారునాకు తెలుసు నేను చాలా విషయాలలో అందరిలా ఆలోచించనుకొంచెం డిఫరెంట్ లేఉదాహరణలు అవీ ఇవీ ఇవ్వలేనుకాని, నాకు తెలుస్తూంది

ఒక ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయి కూడా ఇదే మాట అందివందమంది ఒక డైరక్షన్ లో చూపెడితే, నేను ఒక్కడినే మరోవైపు చుపెడుతాను అటఅందుకు గొప్పగా ఫీల్ అవ్వాలి గాని, బాధ పడటం దేనికి ? అదేదో సినిమా లో హీరో పాట పాడతాడు లోకం అంతా ఒకవైపునేను ఒక్కడినే ఒకవైపు అనిపాటలు ఎంజాయ్ చేస్తారు గాని …. నిజంగా కనిపిస్తే ఒప్పుకోలేరు అనుకుంటాప్రతి దానికి, నాకు తెలుసునాకు సలహాలు ఇవ్వద్దు అని చెబుతున్నానుఅది కరక్టే కదాఎవరో ఏదో చెప్తే అది చెయ్యాలా ?? ఆఫీసు లోను అంతే, ఎవరి ఏది చెప్పినా నాకు నచ్చితేనే చేస్తున్నానువాడు చెప్పింది కరెక్ట్ అయినా, నాకు నచ్చకపోతే చేయడం లేదు.

ఇంకా, నా గురించి నేను తెలుసుకోవాల్సింది ఉంది అనుకుంటాఒక ఇయర్ క్రితం అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అన్న ఇది ఉండేదిఅదేంటో, ఇప్పుడటువంటిది ఏమి లేదులేస్తున్నామా, ఆఫీసు కు వెళ్తున్నమా, తింటున్నామాఅంతేఇది నాకు నచ్చడం లేదుఎక్కడో, ఏదో అసంతృప్తి

నా ఇంకొక భయం ఏమిటి అంటే … నేను అంత త్వరగా ఎవరినీ ఇష్టపడను … పవన్ గాడికి, సాయి కిషోర్ కు పెళ్లి సంబందాలు చూస్తున్నారు …. అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారంట, అంత తొందరగా దొరకట్లేదు అంట. మనకు ఇంకో రెండు ఇయర్ వరకు పెళ్లి ఆలోచన లేదు … మరి అప్పటికి, మనకు నెత్తి మీద జుట్టు ఉంటుందా ? డౌటే !!! జుట్టు లేనివాడిని ఎవరు ఇష్టపడతారు ? ఎవరు ఇష్టపడ్డా, నన్ను ఇష్టడినవారిని నేను ఇష్టపడతానా ? మనతో పాటు, చివరివరకు ఉండాల్సిన వాళ్లు … మనం ప్రేమించే, అభిమానించే, ఆరాధించే లక్షణాలు వారిలో ఉంటాయా ? బేసిగ్గా, నాకు పెద్ద కోరికలు ఏమి లేవు … కొంచెం పొడుగ్గా (లేకపోతె, ముద్దు పెట్టుకోవడం కష్టం), కొంచెం తెల్లగా, కొంచెం అందంగా, అన్నిటిని మించి మంచి గా ఉంటే చాలు (నా ఉద్దేశం, అందరు అమ్మాయిలు చెడ్డవారు అని కాదు). ఇక్కడ మంచి అంటే ఏమిటి ? ఎవరు మంచి, ఎవరు చెడ్డ అని ఎలా డిసైడ్ చేస్తాం ? ఇది చాలా కష్టమయిన ప్రశ్న. జడ కొంచెం పొడుగ్గా, దట్టంగా ఉంటే ఇంకా హ్యాపీ !! (ఎక్కడో చదివాను, పెద్ద జడలను ఇష్టపడడం ఒక జబ్బు అని, అయినా సరే), కాళ్ళకు పట్టీలు ఇస్తపదేవారంటే ఇంకా సూపర్ … జాబ్ చెయ్యకపోతే హ్యాపీ, చేసినా ఓకే (కాని, సాఫ్టువేర్ జాబ్ మాత్రం వద్దు) … మొక్కలను ఇష్టపడాలి … ఇంకా, మనం తప్పు చేస్తున్నాం అనిపిస్తే ఇది తప్పు అని చెప్పాలి … మరీ అంత ఫాస్ట్ కాకుండా … మరీ అంత స్లో కాకుండా … ఇంకా ఎలా అంటే, ఇప్పటివరకు నేను కథలు, స్వాతి లో సేరియల్లు చాలానే చదివాను … అవి చదువుతున్నంత సేపు అందులో హీరోయిన్స్ భలే నచ్చేవారు … ఎలా అంటే, యోధుడు లో మధురిమ లా, మహార్ణవం లో ఉమ లా, సెకండ్ మాన్ లో స్నేహ లత లా, అదేదో లో మాధవి లా. మనకు ఇటువంటివాళ్ళు దొరుకుతారా ? ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటి అంటే వాళ్లు అందరు హీరోయిన్స్, కాని, ఇక్కడ మనం హీరో కాదే !!!

ఇప్పటివరకు అటువంటి వాళ్లు తగల్లేదా అంటే , నిజం చెప్పాలి అంటే, ఒకే ఒక్క అమ్మాయి అని చెప్పొచు … నాకు ఇప్పటికి అనిపిస్తుంది అరే, అ అమ్మాయి అయితే యెంత బాగుండును అని … కాని, మనం కోరుకున్న్వాన్ని దక్కితే, అది లైఫ్ ఎలా అవుతుంది ? ప్చ్, ఏం చేస్తాం ??? దేవుడు, ఇంకేవరినయినా పుట్టించాడేమో చూడాలి…

ఇక బావ చెప్పిన సంగతికి వద్దాం … మనకి అదేదో పాదం లో చందమామ ఉందట … దాని అర్థం, మనకు చందమామ అంత అందమయిన, మంచి అమ్మాయి వస్తుందట ! జాతకాలు ఎంతవరకు నిజమో, ఎంతవరకు నమ్మాలో , ఏమో ???
సో, మన పెళ్లి సంగతి , అమ్మాయి సంగతి బావ చేతిలోనూ, హేమ చేతిలోనూ పెట్టేద్దాం !!!

కథ ఎక్కడివరకు, ఎలా వెళ్తుందో చూద్దాం …

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑