ఆ నీలగిరులలో …

33b2a-dsc02144

“ప్రయాణంలో ప్రతి అడుగు పాఠమే. పరధ్యానంగా నడుస్తున్నపుడు కస్సున గుచ్చుకునే ముల్లు నిరంతరం అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తుంది. అంతెత్తు కొండలు మనమెంత అల్పులమో గుర్తు చేస్తాయి. ఆ ఎత్తుకు చేరాలంటే యెంత కష్టపడాలో చెబుతాయి. పారే జలపాతం ఉత్సాహ రహస్యం. పండ్లతో ఒరిగిన చెట్లు పరోపకార స్పూర్తి “

ఇవి ఒక రోజు ఈనాడు లో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గురించి రాసినపుడు చదివిన విషయాలు. రాజ కుమారి దక్కినా, దక్కకపోయినా సాహసాలు మాత్రం చేసి తీరాల్సిందే అనుకునే వారి కోసమే

వై. హెచ్.ఏ.ఐ. ట్రెక్కింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంది. నాకు తెలియని విషయం ఏమిటి అంటే నాకు కొండలు, చెట్లు, నదులు అంటే ఇష్టమని. ఇది చదివిన వెంటనే ఎలాగయినా సరే ఈసారి ట్రెక్కింగ్ కు వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాను. వెంటనే డి.డి తీసి చెన్నై కి పంపేసాను, వారం రోజులు లీవ్ అప్లై చేసేసాను. ఇక ప్రతి రోజు ఈ ఆలోచనలే, ప్రతి వారం షాపింగే. ఏప్రిల్-౨౬ (ఇరవై ఆరు) ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని … హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లి, అక్కడనుడి ఊటీ వెళ్దామని ప్లాన్. అంతా బాగానే అయ్యింది … ఇరవై ఆరున ఊటీ లో అడుగు పెట్టాను … దిగగానే ఆటో వాడు జలక్ ఇచ్చాడు … ఊటీ బస్ స్టాండ్ నుండి యూత్ హాస్టల్ ఒక కిలోమీటరు కూడా ఉండదు, ముప్పై రూపాయలు తీసుకున్నాడు … టైం మార్నింగ్ ఆరున్నర అయింది … వాతావరణం ఆహ్లాదంగా ఉంది … ఊటీ యూత్ హాస్టల్ బావుంది … ఇప్పటివరకు మనకు తెలియని వాళ్ళు పరిచయం అవుతారు, ఎలా ఉంటారో, మన ట్రిప్ ఎలా ఉంటుందో ఇలా చాలా చాలా ఫీలింగ్స్ …

ab191-dsc01971
YHAI Guest house, Ooty

అప్పటికే కార్తీక్ విజయవాడ నుండి వచ్చాడు … తనను చూడగానే నాకు షాక్ … ఎందుకంటె తను జస్ట్ పద్నాలుగు సంవత్సరాలు … అంతే … ఊటీ చూద్దామని బయటకు వెళ్ళాను … బ్లాక్ కలర్ స్వెట్టర్ కనిపించింది … నచ్చింది … కొనేసాను … చిన్నగా వర్షం పడుతోంది … ఇంతలో కందస్వామి, సుభాష్, సెంథిల్, … వచ్చారు. బి.డి.ఎస్ చదువుతున్నారు. పరిచయం చేసుకున్నాను. రెండున్నరకు మహేంద్ర జీప్ లో పార్సన్స్ వ్యాలీ కు తీసుకెళ్ళారు. పదిహేను కిలోమీటర్లు, జర్నీ బావుంది.

71d7c-dsc01987
Parson Valley Guest house

చలిగా ఉంది. స్వెట్టర్ వేసుకుని, టీ తాగుతూ ఎంజాయ్ చేసాము, సాయంత్రం అవుతుంది. ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు. నాకు ఎలా అనిపించింది అంటే మన ఇంట్లో పెళ్లి అవుతుంటే బంధువుల కోసం ఎలా వెయిట్ చేస్తామో అలా. రాత్రి డిన్నర్ అయిన తరువాత ఒక్కొక్కరి పరిచయం అయింది. ఎలా ఉండాలి, ఏమి ఏమి చెయ్యాలి అని చెప్పారు. అమ్మాయిల కోసం ఒక రూం, అబ్బాయిలకు సెపరేట్. నిద్ర పట్టడం లేదు. ఒకటే చలి. రెండు స్వెట్టర్ లు వేసుకున్నాను, అయినా సరే. రాత్రి పడుకునే ముందు పాలు ఇచ్చారు. రాధ ఆంటీ, రమ ఆంటీ, రామనాథ్, ఆదిత్య, ప్రసన్న ఎప్పుడో లేటుగా వచ్చారు. మొత్తం ముప్పయి మంది, పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు. ఇవి నా మొదటి రోజు అనుభవాలు …

నేను ఈనాడులో చదివాను, యూత్ హాస్టల్స్ లో అంత క్రమశిక్షణతో ఉంటారని. దానికి తగ్గట్టుగానే, ఉదయం 6 (ఆరు) కల్లా విజిల్ వేసేస్తారు. ముందు టీ, తరువాత కాలకృత్యాలు, ఏడున్నరకు బ్రేక్ ఫాస్ట్, ఎనిమిదిన్నరకు లంచ్ ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. ఇవాళ చాలా బావుంది. ఎందుకంటె, లైఫ్ లో ఫస్ట్ టైం ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకో ఇవాళ లేట్ అయింది. లంచ్ చేసి బయలుదేరుతాం అట. అక్కడ పర్సన్స్ వ్యాలీ డం ఉంది, చూడడానికి అందరం బయలుదేరాం.

 

744f8-dsc02020
Yoga Asanas @ 07.00 AM

పన్నెండు గంటలకి బయలుదేరాం. చాలా, చాలా మంచి ఫీలింగ్. అందరికి థాంక్స్ చెప్పి, దేవుడిని ప్రార్థించి, ముందు పిల్లలు, ఆడవాళ్ళు, తరువాత అబ్బాయిలు అందరు ఒకే గ్రూపుగా బయలుదేరాం. నెమ్మదిగా మాట్లాడుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, మధ్య, మధ్య చిన్న చిన్న బ్రేక్ తీసుకుంటూ, సాయంత్రం నాలుగు గంటలకు ముకుర్తి చేరుకున్నాం. 

మా మజిలిలో కొన్ని తీపి గురుతులు :

0d5ee-dsc02127d7ab0-dsc0210595e9a-secondhalf2

 

ఆ నీలగిరులలో ...
Ramesh, our Guide

అందరూ ఇతనిని రమేష్ అన్నా, రమేష్ అన్నా అని పిలిచేవారు.

ఇవన్నీ చూస్తూ, ఎంజాయ్ చేస్తూ సాయంత్రానికి ముకుర్తి చేరుకున్నాం.మా గురించి ఎదురు చూస్తూ సింగ్ గారు వెల్ కం చెప్పారు. రాగానే వేడి, వేడి టీ ఇచ్చారు. ఇక్కడ ఏనుగులు, చిరుతలు, అడవి దున్నలు తిరుగుతాయి, ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లొద్దు అని చెప్పారు. దగ్గరలో డాం ఉంది. కనీసం బాత్ రూం కు కూడా వాటర్ లేదు, డాం కు వెళ్ళాల్సిందే.

ఇక్కడ ఈ రోజు మేము ఉండబోయే కాటేజ్ బావుంది, చుట్టూ అడవి, జంతువులు ఏమి రాకుండా ఫెన్సింగ్. నాకు అయితే బలే బలే నచ్చేసింది. వెంటనే ఫొటోస్ తీయడం మొదలు పెట్టేసాను.

0732f-dsc02163

చూడగానే నాకు ఇంగ్లీష్ సినిమాలు గుర్తుకు వచ్చాయి. దయ్యం సినిమాలలో ఇల్లు ఇలానే ఉంటాయి. ముందు వరండా, మూడు గదులు. ఒకటి అమ్మాయిలకు, ఒకటి అబ్బాయిలకు, ఒకటి సింగ్ గారికి.

బాగ్ లోపల పెట్టి డాం చూడడానికి బయలుదేరాం, వాటర్ బాటిల్స్ పట్టుకుని. నది ప్రవహిస్తున్న చప్పుడు ఆ ప్రశాంత వాతావరణంలో చాలా బావుంది. ఇక్కడ తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ల ఆఫీసు ఉంది. అక్కడి వాళ్లు చెప్పారు, రొజూ ఏనుగులు నీళ్లు తాగడానికి వస్తాయని, ఫెన్సింగ్ ను తొక్కి వెల్లిపోతాయని.

ఆ నీలగిరులలో ...
I am scared !!

వచ్చిన తరువాత అలాగే కబుర్లు చెబుతూ కూర్చున్నాం.ఎనిమిదిన్నరకు డిన్నర్. చపాతి & వెజ్ రైస్. ఇక్కడ క్యాంపు ఫైర్ వెయ్యకూడదు. తొమ్మిది కల్లా పడుకున్నాం. చాలా చలిగా ఉంది. మొత్తం కాటేజ్ అంతటికీ ఒకే ఒక లైన్ ఉంది. సో, లైట్ ఆఫ్ చెయ్యకుండానే పడుకున్నాం. చాలా చలిగా ఉంది. రగ్గులు, స్వెటర్లు సరిపోడం లేదు.

మూడు గంటలకు మెలకువ వచ్చేసింది. రెండు కారణాలు ఉనాయి. ఒకటి చలి అయితే, రెండవది ఏనుగుల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఒకవేళ ఏనుగులు గేటు ను విరగ్గొట్టి లోపలికి వస్తాయేమో అన్న ఆలోచనల వల్ల.  నా దగ్గర స్వాతి ఉంది. అప్పుడు చదవడం మొదలెట్టాను. మళ్ళా పడుకున్నాను. ఉదయం ఆరు గంటలకు సింగ్ గారు విజిల్ వేసి అందరిని నిద్ర లేపెసారు.

 

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑