సరిగా తిని చాలా రోజులయింది … బహుశా రెండు వారాలు … బావ దగ్గరకు వెళ్ళినప్పుడు అనుకుంటాను … ఆదివారం … లేచేటప్పటికే పన్నెండు అయింది … విపరీతంగా ఆకలేస్తుంది … వంట రాకపోడం పెద్ద తప్పు … చిన్నప్పడు ఎప్పుడు కిచెన్ లోకి వెళ్ళినా అమ్మ తిట్టేది … అందుకే ఇప్పుడు ఇలా తయారయ్యాం … నిన్న జితన్ చెప్పాడు, నూడుల్స్ ఎలా చేయాలో … ట్రై చేద్దాం అనిపించింది … ముందు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి . మరో పక్క నూడుల్స్, బటానీలు ఉడకబెట్టాలి. కొంతసేపటికి ఏమి అవుతుందంటే నూడుల్స్ సెపరేట్ గా విడిపోతాయి. ఇప్పడు కొంచం ఆయిల్ వేసి జీలకర్ర వేయించాలి, తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు ఒకదాని తరువాత మరొకటి
వేయించాలి. అవి కొంచం దోరగా, ఎర్రగా అయిన తరువాత ఉడికిన నూడుల్స్, బటానీలు కలిపేయాలి. కొంచం సేపు అయిన తరువాత, సాల్ట్, మసాలా కలిపేయాలి. మంట కొంచం తగ్గించి మూత పెట్టి, స్టవ్ ఆఫ్ చేయాలి.
idamtaa స్టొరీ కి సగమే. నెక్స్ట్, ఫ్రిజ్ నుండి చల్ల, చల్ల ని కరోనా బీర్ ఓపెన్ చేయాలి. ఫ్రెష్ ఫార్మ్స్ లో కొన్న, జుసి నిమ్మ కాయలు కట్ చేయాలి. నెమ్మది, నెమ్మదిగా నిమ్మకాయను పిండాలి. బాగా కలపాలి.
ఇక ఫైనల్ పార్ట్. నూడుల్స్ లో నిమ్మ రసం పిండి, కరోనా పట్టుకుని కంప్యూటర్ ముందు కూర్చోవాలి. ‘యు ట్యూబ్’ ఓపెన్ చేసి, చిరంజీవి గ్యాంగ్ లీడర్ అని టైపు చేసి, ‘చికి చికి చెలం’ సాంగ్ సెలెక్ట్ చేసి, వోల్యుం బాగా పెంచి, హెడ్ ఫోన్స్ పెట్టుకుని వేడి, వేడిగా తినేయాలి … ఆనందం నీ సొంతం …
good one