లీప్ ఇయర్ …

బేసిగ్గా ఈ మధ్య ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నాను, ముఖ్యంగా రొమాంటిక్ మూవీస్…ఇప్పటి వరకూ నాకు తెలియదు…అవి అంత బావుంటాయి అని…ఏ.ఎం.సి ౩౦ లో సినిమా చూడడానికి వెళ్ళాం…”లీప్ ఇయర్” … థియేటర్ లో అడుగుపెట్టాను … నేను మూడో వాడిని … స్టార్ట్ అయింది … హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఐర్లాండ్ లో ఏదో కాన్ఫరెన్స్ లో ఉంటాడు … ఓక నమ్మకం ఉంటుంది, ఏ అమ్మాయి అయినా ఫెబ్రవరి “౨౯” న ప్రొపోజ్ చేస్తే అబ్బాయి వద్దు అనకూడదు. ఈవిడ వాడికి చెబ్దాం అని బయలుదేరుతుంది. మధ్యలో పెద్ద తుఫాను వచ్చి విమానం డబ్లిన్ దగ్గరలో దిగిపోతుంది. ఈవిడ ఓక పడవ మాట్లాడి బయలుదేరుతుంది. అది కూడా తిన్నగా వెళ్ళకుండా వేరేచోటికి వెళ్ళిపోతుంది.
అక్కడ మన హీరో ఉంటాడు, ఓక చిన్న హొటల్ నడుపుతూ ఉంటాడు. ఈమె వెళ్లి డబ్లిన్ వెళ్ళడాని కి టాక్సీ ఉన్నాయేమోనని అడుగుతుంది. హీరో డబ్బులు కట్టకపోవడం తో రేపు క్లోజ్ అయిపోతున్దబోతుంది. వీడు డబ్బుల కోసం సరే, తన కారులో తీసుకువెళ్తాను అంటాడు. మధ్యలో కారు ఓక గుంత లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు అలా నడుచుకున్తూనే ఓక రైల్వే స్టేషన్ కు వెళ్తారు. కాని ఆ రోజు కి ఇక ట్రైన్స్ ఉండవు. సరే అని, ఓక ఇంటికి వెళ్తారు. అక్కడ తెలుస్తుంది, వాళ్ళు కపుల్స్ కే స్టే ఇస్తారు. వెంటనే అబద్దం చెబ్తారు – మాకు పెళ్లి అయింది అని. ఆ రోజు డిన్నర్ లో మొత్తం మూడు జంటలు ఉంటాయి. వాళ్ళు మాములుగానే ముద్దులు పెట్టుకుంటారు. వీళ్ళను కూడా కిస్ చేయమంటారు. కాని వీళ్ళు నిజమయిన కపుల్స్ కాదు కదా. కొంచం ఇబ్బంది పడతారు. బలవంత పెట్టేటప్పటికి కొంచం, కొంచం గా మొదలు పెట్టి, ఘాడంగా ఇంగ్లీష్ కిస్ పెట్టేసుకుంటారు. అబ్బా, ఆ సీన్ చూస్తుంటే అనిపిస్తుంది మనం ఎప్పడు కిస్ చేస్తాం అని … ఆ ఫీలింగ్ రాకపోతే ఒట్టు …
దారిలో అడుగుతాడు, నువ్వు ఉన్న ఇల్లు కాలిపోతుంటే , నువ్వు ఏది కాపాడుకున్తావు అని. ఏమి చెప్పలేకపోతుంది. అలా, అలా ఇద్దరికీ ఇష్టం మొదలవుతుంది. చివరకు ఆమెను డబ్లిన్ తీసుకెళతాడు. ఆమెకు ప్రోపోసే చేద్దాం అనుకున్నంతలో డాక్టర్ బాయ్ ఫ్రెండ్ వచ్చి ‘విల్ యు మేరీ మీ ? ‘ అని రింగ్ ఇచ్చి ప్రొపోజ్ చేస్తాడు. ఇది చూసి మన హీరో పగిలిన గుండెతో వెళ్ళిపోతాడు.
ఎంగేజ్ మెంట్ పార్టీలో ఆమె కు ఎందుకో డౌట్ వచ్చి వీడికి ఓక టెస్ట్ పెడుతుంది. ఫైర్ అలారం ఆన్ చేస్తుంది. ఈ డాక్టర్ గాడు ఫోను, కంప్యూటర్ జాగ్రత్త చేస్తాడు తప్ప ఈమెను పట్టించుకోడు. ఆమె రియలైజ్ అయ్యి హీరో దగ్గరకు వెళ్ళిపోతుంది. వాడు అక్కడ హోటల్ బాగా నడుపుతున్డాడు.
సినిమా అయిపోతుంది … ఓక అందమయిన ముద్దుతో … ఇందులోని సీన్స్ చాలా సార్లు చూసినప్పటికీ, అందమయిన హీరోయిన్, అంతకంటే అందమయిన ఐర్లాండ్ నేచర్ చూస్తేయ్ లైఫ్ లో ఒక్కసారి అయినా అక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది . . .

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑