అప్పుడెపుడో ఎక్కడో చదివాను, ప్రపంచంలో చదువుకున్న వాడు, చదువు లేనోడు, డబ్బు ఉన్నోడు డబ్బు లేనోడు, వాడు వీడు అని తేడా లేకుండా అందరికి తెలిసిన ఒకే ఒక్క దేశం అమెరికా … అమెరికా అంటే ఫ్రీడం, అమెరికా అంటే ఒకడి టాలెంట్ కు సరిపడా రెకగ్నిషన్ దొరికే దేశం, అమెరికా అంటే డబ్బు. ఇవీ నేను విన్నవి, నాకు తెలిసినవి. అటువంటి అమెరికా వెళ్ళాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను కూడా మినహా యింపు కాదు.
చిన్నప్పడు ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నపుడు అనిపించేది, అసలెలా ఉంటుందో చూడాలని…కాని ఎప్పుడూ ట్రై చెయ్యలేదు, అవకాశం వచ్చింది. ఎలా పని చేస్తానో అనుకుంటూనే అడుగుపెట్టాను. ఫస్ట్ టైం కదా, ఎందుకో చాల టెన్షన్ , ప్రెజర్ ఫీల్ అయ్యేవాడిని. ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. వచ్చి రాగ్గానే నాకు నచ్చేసినవి రెండు విషయాలు. ఒకటి ఇక్కడి రోడ్లు. ఓక కారు రెంట్ కి తీసుకుని అమెరికా అంతా చుట్టేయాలి అనిపిస్తుంది.. డ్రైవింగ్ రానందుకు ఎన్ని సార్లు తిట్టుకున్నానో నాకే తెలియదు. అనిపిస్తుంది ఓక మంచి కారు తీసుకుని, మంచి పాటలు పెట్టుకుని, రాత్రి పగలు అలా వెల్లిపోతూనే ఉండాలి. ఎప్పటికి తీరుతుందో ఈ కోరిక ???
రెండు, ఇక్కడ అమ్మాయిలు. అదేంటో ఆపిల్ కలర్ లో ఉంటారు. ఇక్కడకు వచేముందు బావ చెప్పాడు, ఇక్కడ అమ్మాయిలు అదేకో శిల్పం చెక్కినట్లు ఉంటారు అని. చూసిన తరువాత తెలిసింది నిజమని. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మేకప్ ఎక్కువ. అదే పని గా చూడడం తప్పు అని తెలిసినా చూడకుండా ఉండలేం.
Leave a comment