ప్రమోషన్స్ …

అప్పుడపుడు నాకు అనిపిస్తుంటుంది కొన్ని కంపెనీ లలో ప్రమోషన్స్ బుల్ షిట్ అని. అవి ఓక మనిషి పెర్ఫార్మన్స్ మీద కాకుండా ఇంకా చాలా చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది … ఓక సంవత్సరం లో ఎంత మందికి ఇవ్వాలి, ఏ ఏ లెవెల్స్ లో ఉన్న వాళ్ళకు ఎన్ని ఇవ్వాలి అన్ని ముందే డిసైడ్ అయిపోతాయి. ఇది కరెక్ట్ ఏ అయినా, బాగా పని చేసిన వాళ్లకు కూడా డిస్కషన్ రూం లోకి పిలిచి తొక్కలో రీజన్స్ చెప్తారు. జనరల్ గా, ఒకడు ఎక్కువ కాలం ఒకే ప్రాజెక్ట్లో ఉంటే వాడికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ … అలా కాకుండా మూడు సంవత్సరాలలో మూడు ప్రాజెక్ట్స్ మారితే వాడికి కష్టమే !!!

పైన చెప్పినవన్నీ నా విషయం లో కరెక్ట్ అని నేను ఫీల్ అవుతున్నప్పటికీ, అదేదో ఆక్రోశం తో చెబుతున్నది కాదు, నిజం. ఓక సారి ప్రాజెక్ట్ మారితే నీ గురించి పట్టించుకోనేవాడే ఉండడు. చాల మందిని చూసాను, అప్ప్రైజాల్ టైం లో పాత మేనేజెర్స్ చుట్టూ తిరగడం.

నేను నమ్ముతాను, నీ పని నువ్వు బాగా చెయ్యడం అంతే నువ్వు చెయ్యవలసింది. దానిని బట్టి నీకు ఏ రేటింగ్ ఇవ్వాలి, ప్రమోషన్ ఇవ్వాలా, వద్దా ఇవి డిసైడ్ చెయ్యడం మేనేజర్స్ పని. అలా కాకుండా, నేను ఇది చేసాను, అది చేసాను, నాకు ఎందుకు ఇవ్వరు ఇలా అడుక్కోవాల్సి వస్తుంది. ఇది కర్రేక్తో, కాదో నాకు తెలియదు.

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑