అటువంటి అన్నయ్య ప్రజా సేవ చేస్తానంటూ కంపు కొట్టే రాజకీయ ట్రైన్ ఎక్కి అసెంబ్లీ లోకి వెళ్లావు. పార్టీ పెట్టే ముందు తెలంగాణా ప్రజలు కోరుకుంటే సెపరేట్ స్టేట్ ఇస్తానన్నావు. వేరే పార్టీలలో సీట్లు రావు అనుకున్న వాళ్ళు వస్తే తీసేసుకున్నావు. కాని తెలంగాణా లో ఒక్క సీట్ కూడా రాలేదు. ఇప్పుడు మిగతా వాళ్ళు చేసే ఒత్తిడికి లొంగి, నేను తప్పటడుగు వేసాను తప్ప తప్పుటడుగు వేయలేదు అని మాట మారుస్తూ, మిగతా వాళ్ళలాగే మాట్లాడుతున్నావు.
ప్రజా సేవ అంటే నీకు ఉన్నది కూడా అమ్మి అవసరం అయిన వాళ్లకు ఇవ్వడం. నీ బావమరిది మంచి నిర్మాత కావచ్చు. కాని మంచి ప్రజా సేవకుడు కాదు. అసలు ఏమి చేద్దామని అనకాపల్లి లో పోటి చేసాడు. కనీసం ఒడిపోయిన తరువాత ఒక్కసారి అయినా ప్రజల మొహం చూసాడా ?
నీ తమ్ముడు సభలలో, సమావేశాలలో అన్నయ్య, శక్తి అంటుంటాడు. యువ రాజ్యం అధ్యక్షుడు అయ్యాడు. ఎన్నికలు అయిన తరువాత ఒక్కసారి అయినా ప్రజల మొహం చూసాడా ?
నేను ఏమి సెపరేట్ స్టేట్ కావాలి అనేవాడిని కాదు, వద్దు అనే వాడిని కాదు, నీ అభిమానిని. నీకు మంచి జరగాలి అని కోరుకునే వాడిని. దేవుడు నిన్ను మంచి దారిలో నడపాలి, నీ వల్ల కొందరికి అయినా మంచి జరగాలి.
Leave a comment