ఎవరయినా నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే నేను ఆలోచనలో పడతాను. ఫ్రెండంటే సినిమాలలో లాగా త్యాగాలు చెయ్యాలా ?, నువ్వు ప్రేమించిన అమ్మాయిని తను కూడా ప్రేమించి, నీ కోసం వదిలేయాలా ? ఏమో, అలాంటి వాళ్ళు ఎవరు నాకు లేరు. కాని వీడి పేరు చెప్పకుండా ఉండలేను. నాకు ఫ్రెండా ? క్లాసు మేటా ? ఒకప్పటి రూం మేటా ? అన్నీను !!!
మా స్నేహం వయసు ఆరు సంవత్సరాలు. అది రెండువేల మూడు, సెప్టెంబర్ నెల. ఎం.సి.ఏ చదవడానికి హైదరాబాద్ వచ్చాను. ముందు మాటలాడు తుంటే సొల్లు చెబుతున్నాడు అనిపించింది. నేను ఉండే మా బావ రూం, వీడు ఉండే వాళ్ళ అన్న ఇళ్ళు దగ్గరే. మొదట్లో ఆ విషయం నాకు తెలుసు. కాని నేను ఎక్కడ ఉండేది చెప్పలేదు. ఎక్కడ డిస్టర్బ్ చేస్తాడో అని. సమయం అలా గడిచిపోయింది. నేను గమనించింది ఏమిటి అంటే వీడికి కేర్ లెస్ నెస్ ఎక్కువ, డబ్బులు అంటే అంత విలువ లేదు, సొల్లు చెబుతాడు అని. కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి. ఎటువంటి సమయంలో అయినా నిద్ర పోగలడు. గుర్రాలు నిలుచుని నిద్ర పోతాయంట. కాని అవి నడుస్తూ నిద్ర పోలేవు. వీడిని చూస్తే అనిపించేది, అలా చేయగలడు అని. అంత ఫాస్ట్ గా నిద్రలోకి జారుకుంటాడు.
మొదట్లో అమ్మాయిల హాస్టల్స్ చుట్టూ తిరిగే వాడు. వెంటనే కొత్త పేరు వచేసింది, గాలి అని. ఇప్పటికి మేము అలాగే పిలుస్తాము. నాకు అన్నింటికన్నా బాగా నచ్చిన విషయం ఏమిటి అంటే కూల్ గా ఉంటాడు, అన్ని వేళలా. చాలా మంది అలా ఉండలేరు. మనోడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. బాగా ఇమిటేట్ చేసేవాడు. ఇంకొకటి సినిమాల పిచ్చి. తన లక్ష్యం [అని చెప్పేవాడు] సినిమాకు దర్శకత్వం చేయాలి అని. చూడాలి ఏం చేస్తాడో ??? జాని సినిమాలో చివరి సీన్ ఉంటుంది, ఓక పిచ్చుక పూల మొక్క మీద నుండి ఎగిరిపోతుంది, స్వేచ్ఛగా. ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ సృజనాత్మకత కనిపిస్తుందట. వీడు ఏమి డైరెక్ట్ చేయకపోతే ఒక తీయించాలి.
క్రికెట్ బాగా ఆడతాడు. ప్రస్తుతం ఓక సాఫ్టువేరు కంపెనీ లో పని చేస్తున్నాడు. నాకు అనిపిస్తుంది వీడు సొల్లు చెప్పే విధానం, ప్రతి ఆదివారం నాడు క్రికెట్ కోసం జనాలను పోగుచేసే విధానం, అమ్మాయిలతో మాటలాడే పద్దతి, ఎవరయినా ప్రాబ్లం లలో ఉంటే వాళ్ళను ఊరడించే మాటలు – ఇవన్ని చూస్తుంటే వీడు చేసే జాబు సూట్ కాదు ఏమో అనిపిస్తుంది.
mఅంచి మేనేజర్ అయితే బావుండును.
ఇదంతా చదువుతూంటే ఇందులో రాసిన దానికి, నా ఫ్రెండ్ అవడానికి సంబంధం లేదు కదా అనుకుంటున్నావా ? అదంతే !!!
Leave a comment