లాస్ట్ వారం రోజుల నుండి నా ఆలోచనలు అన్నీమారిపోయాయి నీ ఆలోచనలతో . బావ ఒకరోజు ఉదయాన్నే కాల్ చేసి చాలా మంచి సంబంధం అట అని నీ గురించి చెప్పేటప్పటికి నేను ఎదురు చూస్తున్న చందమామ నువ్వేనా అనిపించింది !!! నా తూర్పు గోదావరి లో పుట్టిన, కళ్ళజోడు పెట్టుకున్న, పొడుగు జడ ఉన్న, అందమయిన వెన్నెల కురిపించే అమ్మాయివి నువ్వేనా అనిపించసాగింది. అంత లోనే ఎన్నో అనుమానాలు, భయాలు !!! ఇద్దరికీ మధ్య ఏడు సంవత్సరాలు డిఫరెన్సు. తప్పు ఏమో అని. అమ్మ చెప్పింది పది సంవత్సరాలు కూడా ఉంటాయి అని. ఎలాగో కన్విన్స్ అయిపోయాను. ఇంజనీరింగ్ అవకుండానే అప్పుడే పెళ్లి చేసెయ్యడానికి అంత తొందర ఏమిటి ?
సాధారణంగా స్టుడియోలో తీసిన ఫోటోలు అంత నిజం కాదు. మామూలు ఫోటోలోనే ఇంత అందంగా ఉంటే నిజం గా ఎలా ఉంటావో ?? అత్తకు సాధారణం గా ఎవరూ నచ్చరట, ఐశ్వర్యా రాయ్ అయినా !!! అటువంటిది నువ్వు నచ్చావంటే అమ్మో ఎలా ఉంటావో ?? వాళ్ళు ఏలూరు వెళ్తే, ఎవరో తెలిసిన వాళ్ళు నీ గురించి చెప్పారట. బావ అంటున్నాడు, ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా నీ గురించి చెప్పారంటే నువ్వు ఎలా ఉంటావో ?? అత్తకు, అమ్మకు, నాన్నకు, మామకు అందరికీ నచ్చేసావు. నువ్వు ఎలా ఉంటావో ?
అనవసర బయాలు అంతలోనే ! నీ జాతకం, నా జాతకం చూసి ఇద్దరికీ అంత కలవలేదు అని ఎవరో చెప్పారు. బయపడ్డాను. అయినా నన్ను నేను కన్విన్స్ చేసేసుకున్నాను. ఏమో ఎప్పుడో ఇరవయి సంవత్స రాల క్రితం నువ్వు పుట్టిన టైం కరెక్ట్ గా నోట్ చేసారు అని గారంటీ ఏమిటి. ఒక్క సెకను తేడా వచ్చినా జాతకాలు మారిపోతాయి. అటువంటిది జాతకాలను ఎలా నమ్మను ? మీ వాళ్ళు జాతకాలు చూడరు అని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. దేవుడా థాంక్స్ !!! నీ గురించి మాటలాడుతుంటే బావ చేతిలోని ఫోను కింద పడి ముక్కలు అయిపోయిందట.
నిన్ను చూడడానికి ఇంకో పది రోజులలో మన గాంగ్ కాకినాడ బయలుదేరుతున్నారు. ఏమవుతుందో ?? వీళ్ళు అందరి మాటలతో నాకు ఏమి అనిపిస్తుందంటే నీ ఫోటో అయినా చూడకుండా నిన్ను చేసేసుకోవాలని !!! నీ జాతకం లో ఈ సంవత్సరం పెళ్లి కాదు అని ఉందట. ఈ మాటే నన్ను బయపెడుతుంది. కాని ఒకటి నిజం. దేవుడు ఎవరిని రాసి పెడితే వాళ్ళతో జరుగుతుంది. చూద్దాం ఏమి జరుగుతుందో !!! లాస్ట్ ఇయర్ ఒకతను చెప్పాడు నాకు, “నీ పెళ్లి ముందు చాలా ప్రొబ్లెంస్ ఉంటాయి అని”. ఎటువంటివి అయినా క్లియర్ చేసేయొచ్చు, బావ హెల్ప్ తో.
కాని నేను నీకు నచ్చానా ? నువ్వు నాకు నచ్చుతావా ? వేరే అమ్మాయి గురించి ఆలోచించాలి అనుకోవడం లేదు. నీ గురించి నా బ్లాగులో రాసాను అంటే నువ్వే నా చందమామ అని నమ్ముతున్నాను. ఇప్పటివరకూ నీ అందం గురించి తప్ప , నీ వ్యక్తిత్వం, ఆలోచనలు, ఇష్ట ఇష్టాలు ఏమి మాట్లాడలేదు. తూర్పు గోదావరిలో, మంచి కుటుంబం లో, చందమామను కరెక్ట్ ప్లేస్ లో పెట్టుకున్న నువ్వు చాలా మంచి ఆలోచనలతో ఉంటావని నమ్ముతున్నాను.
ఇవీ నీ గురించి నా ఆలోచనలు. టైం తెల్లవారు జామున మూడు అయింది. రేపు ప్రొడక్షన్ లో పెద్ద ఇన్ స్టాల్ ఉంది. పడుకోవాలి. దేవుడు ఏమి చేస్తాడో చూద్దాం !!!
mari vennela vachinda leda???