ఎప్పటి నుండో సెయింట్ లూయిస్ వెళ్దాము అనుకుంటున్నాము. ఇప్పటికి ఎలాగో కుదిరింది.మేము ఉండే ప్లేస్ నుండి కారులో ఐదు గంటలు జర్నీ. AVIS నుండి కారు రెంట్ కు తీసుకున్నాము. శుక్రవారం రాత్రి రెండున్నరకు బయలుదేరాం. కారు చూడడానికి ముద్దుగా బలే ఉంది. చూడగానే ఇటువంటి కారును ఎప్పుడు డ్రైవ్ చేస్తానో అనిపించింది. నేను, విక్రమ్, విక్రమ్ వైఫ్, జితన్, నితేష్, శ్వేత, రితిక ఒక కారులో, వంచి, రమేష్, సునీల్ వేరే దానిలో.
వీళ్ళు అంత్యాక్షరి మొదలెట్టారు, హిందీ పాటలు. మనకేం వచ్చు. Dunkin Donuts నుండి తెచ్చుకున్న కాఫీ తాగుతూ, వెనక్కి వెళ్ళిపోతున్న రోడ్డును చూస్తూ, వీళ్ళ పాటలు వింటూ, తొంబయి మైళ్ళ వేగంతో మెత్తగా వెళుతున్న కారులో కూర్చుని ఆనందిస్తున్నా.
దారిలో అక్కడక్కడా ఆగుతూ, ఏదో ఒకటి కొనుక్కుని తింటూ, కాఫీ తాగుతూ ఒక నాలుగు గంటలు జర్నీ చేసేటప్పటికి నిద్ర వచ్చేసింది. డ్రైవింగ్ సీట్ లోకి విక్రం వచ్చాడు. ఒక గంట నిద్ర పోయి లేచేటప్పటికి అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు అందంగా కనిపించాడు. జీ. పీ. ఎస్. ఇంకా ఒక గంట ప్రయాణం ఉందని చెప్తుంది. రఘు కు కాల్ చేసి చెప్పాను.

Leave a comment