చికాగో నుండి లాస్ వేగాస్ దాకా …

నేను అమెరికా వచ్చి ఆరు నెలలు అయిపోయింది. ఇప్పటి వరకూ నేను చూసినవి ఏమన్నా ఉన్నాయా అంటే నాకు నచ్చని సమాధానం వస్తుంది, ‘లేదు’ అని. ఆఫీసులో జితన్, వంచి లాస్ వేగాస్ వెళ్దాము అని ప్లాన్ చేసారు. ముందు నేను రాను అని చెప్పాను. కాని కారులో వెళ్తున్నాము అని చెప్పేటప్పటికి టెంప్ట్ అయిపోయాను. ఆఫీసులో అబద్దం చెప్పాము, విమానంలో వెళ్తున్నాము అని. క్లైంట్ మేనేజేర్స్ కి రెండు రోజులు సెలవు తీసుకున్నట్లు చెప్పేసాము. నేను వెళ్ళడానికి కారణం ఏమిటంటే చికాగో నుండి లాస్ వేగాస్ అంటే 1800 మైళ్ళు. పసలపూడి నుండి వైజాగ్ వెళ్ళేటప్పుడు ఆ 200 కిలోమేటర్లకే సంబరాపడిపోయే నేను, ఇంత దూరాన్ని ఎంతలా ఎంజాయ్ చేస్తానో !!!

Ford Explorer రెంట్ కు తీసుకున్నాము. మాతో శ్రీకాంత సిన్హా కూడా జాయిన్ అయ్యాడు. మొత్తం జితన్, వంచి, శ్రీకాంత్, నేను గురు వారం రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరాం.

 d51fb-car

 

ప్రయాణం లో పదనిసలు ఏమిటి అంటే, ఓక ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది. అది వదిలేసి నేను బయలుదేరాను. నా ఐడియా ఏమిటి అంటే, తెల్లవారు జామున రెండు గంటలకు నెట్ కు కానెక్ట్ అయ్యి ఏదో ఒకటి చేద్దాం అని. మూడు గంటలకు ఓమహా సిటీ చేరుకున్నాము. ఇంటర్నెట్ ఎక్కడ దొరుకుతుంది అని అలోచించి, పెద్ద, పెద్ద హోటల్స్ లలో వై-ఫై ఉంటుంది అని, వాటిని వెదకడం మొదలుపెట్టాము. Settle Inn అని దొరికింది. పార్కింగ్ ఏరియా లో పార్క్ చేసి, కారులో నుండే నెట్ కు కనెక్ట్ అయ్యి పని చేయడం మొదలుపెట్టాను. అయిదు అయ్యేటప్పటికి laptop లో చార్జింగ్ అయిపోయింది. మళ్లీ టెన్షన్ మొదలు. ఇంతలో బావ చెప్పిన బంగారు మాట గుర్తుకు వచ్చింది – ” 90 % స్టార్ బక్స్ కాఫీ షాపులలో ఇంటర్నెట్ ఉంటుంది” అని. జి.పీ.ఎస్ లో స్టార్ బక్స్ సెట్ చేసి వెళ్ళేటప్పటికి ఆరు అయింది. నా టైం బావుండి అక్కడ పని చేసే అందమయిన అమ్మాయి చెప్పింది. అయిదు డాలర్లు పెట్టి కూపన్ కొంటె రెండు గంటలు నెట్ వాడుకోవచ్చు. పని మొదలెట్టాను. ఎనిమిది గంటల కల్లా పని అయిపోయింది. ఓక ప్రక్కనుండి వీళ్ళ దొబ్బుడు. మెయిల్ కొట్టి, కాఫీ పట్టుకుని బయలుదేరాం. కొంచం టెన్షన్ పడినా, ఇదో మంచి అనుభవం.

b84c4-route

నా విషయం చివరి వరకూ తెలియకపోవడం వల్ల ఎలా వెళ్తాము, ఎంత దూరం, యెంత సేపు పడుతుంది, ఏమేమి చూడాలి అన్నవి ఆలోచించ లేదు. అమెరికా రోడ్ల మీద గంటకు 80 మైళ్ళకు మించి వెళ్ళలేము. అంటే ఇరవై నాలుగు గంటలు పడుతుంది. మాలో జితన్, వంచి కు తప్ప మిగతా ఇద్దరికీ డ్రైవింగ్ రాదు. ఇద్దరు మార్చి మార్చి డ్రైవింగ్ సీర్ మారి, మెక్ డోనాల్డ్ దగ్గర ఆగి, ఫోటోలు తీసుకుంటూ లాస్ వేగాస్ చేరేటప్పటికి శనివారం ఉదయం రెండు గంటలు అయింది. లింకన్ సిటీ దాటిన తరువాత ప్రయాణం ఇక అద్బుతం. ఎందుకంటే రోడ్డుకి ఇరుపక్కలా అంతెత్తున, మంచు తో తడిచి, ఎండలో మెరుస్తున్న అందమయిన కొండలు. వంపులు తిరిగి ఎన్నెన్నో మలుపులున్న రోడ్లు.

రెండు గంటల ప్రయాణం తరువాత యూట లోకి ప్రవేశించాం. ఇక్కడ ఇంకా అద్బుతం. వంద, నూట యాబయి మైళ్ళ వరకూ ఒక్క పెట్రోల్ బంక్ కూడా ఉండదు.

చికాగో నుండి లాస్ వేగాస్ దాకా ...

ఇక్కడ చాలా జాగ్రత్తగా నడపాలి. తేడా వచ్చిందో ఇంతే సంగతులు.

వెనక సీట్లో జితన్, శ్రీకాంత్ నిద్ర పోతున్నారు. నేను, వంచి మాట్లాడుకుంటూ, మంచులో తడిచిపోయిన కొండలను చూస్తూ వెళ్తున్నాం. రాత్రి రెండు గంటలు లాస్ వేగాస్ చేరుకున్నాం. అంటే దాదాపు ముప్పయి గంటల ప్రయాణం తరువాత.

ఈ ప్రక్కన ఫోతూలన్ని డెన్వర్ దాటిన తరువాత తీసినవి.

7acb3-dscn1020చికాగో నుండి లాస్ వేగాస్ దాకా ...

దూరం నుండి అంత రాత్రి వేళ లాస్ వేగాస్ లైట్లతో వెలిగిపోతోంది. వెళ్ళిన వెంటనే స్నానాలు చేసి, కదిలేటప్పటికి మూడు అయింది. మేము దిగిన హోటల్ The Signature . బేసిక్ గా లాస్ వేగాస్ ను ఎంజాయ్ ఎంజాయ్ చెయ్యాలి అంటే ఈ రెండింటిలో కనీసం ఒక్క ఇంట్రెస్ట్ అయినా ఉండాలి. నా ఉద్దేశం మిగతా వాళ్ళు ఎంజాయ్ చెయ్యలేరు అని కాదు.

(1) జూదం (2) అమ్మాయిలు. ఇప్పటివరకు ఇటువంటి వాతావరణం ఇంగ్లీష్ సినిమా లలో చూడడమే. నిజం గా చూసేటప్పటికి భలే ఆశర్యం కలుగుతుంది. చిట్టి పొట్టి డ్రస్సుల్లో అందమైన అమ్మాయిలను చూడడం కళ్ళకు పండగే. కాసినో అంతా తిరిగి, కొంతసేపు అందరి ఆటలు చూసేటప్పటికి ఆరు అయింది. విపరీతంగా నిద్ర వచ్చేస్తుంది. వచ్చి పడుకుండిపోయాం. మా హోటల్ నుండి చూస్తే :

 

10726-img_1185

లేచి, పన్నెండు గంటలకు కారేసుకుని ఊరు అంతా తిరిగాం . ఎన్నెన్నో వింత, వింత విశేషాలు తెలుస్తున్నాయి. ముందే చెప్పుకున్నట్లు, ఇక్కడ కాసినోలు, స్ట్రిప్ క్లబ్బులు చాలా ఎక్కువ. రోడ్డు మీద ఎక్కడ చూసినా, అమ్మాయిలు, అమ్మాయిలు అని కార్డులు పంచిపెడుతుంటారు.

ఇదిగో ఇలా :

800bf-dscn1101
79293-dscn1106

అలా వెళ్తుంటే, ఇంకా ఎన్నెన్నో వింతలూ తెలిసాయి. అదేంటంటే Drive thru marriages. ఏంటంటే, మీకు పెళ్లి చేసుకోవడానికి టైం లేక పొతే, కారు లో కూర్చుని “I Do”అని చెప్తే పెళ్లి అనిపోయినట్లే.

అలా, హోవర్ డాం కు వెళ్ళాం. ఇది లాస్ వేగాస్ నుండి ఓక ముప్పయి మైళ్ళు ఉంటుంది. ఓక గంట సేపు ఫోటోలు దిగి, ఫోటోలు తీసి, తిరిగి వచ్చేటప్పటికి ఏడు అయింది. మళ్లీ, కాసినోకు బయలుదేరాం. బావ చెప్పాడు, “సముద్రం దగ్గరకు వెళ్లి స్నానం చేయకుండా ఉంటే యెంత చండాలంగా ఉంటుందో, లాస్ వేగాస్ కు వెళ్లి డబ్బ్లు పోగోట్టుకోక పొతే అంటే చండాలంగా ఉంటుంది” అని. కాని నాకు ఇంటరెస్ట్ లేదు, ఏ గేమ్ రాదు కూడా. అయినా ట్రై చేద్దాం అనుకున్నాను. ఒక సింపుల్ గేమ్ ఆడాను. కాసినో వాడికి ఒక పేక ముక్క, నాకు ఒక పేక ముక్క. ఎవరికి ఎక్కువ వస్తే వాడివే డబ్బులు. నాకు లక్ లేదు అని నాకు ముందే తెలుసు. అది మళ్లీ నిరూపించాను. నా ఒక్కడికే లక్ లేదు అనుకున్నాను. మిగిలిన వాళ్ళకు కూడా లేదు. మనకొక్కరికే పొతే ఏడుపు వస్తుంది కాని, మన పక్కనోడికి కూడా పొతే హ్యాపీనే !!! అలా, అలా మూడు అయిపోయింది. తిరిగొచ్చి, పడుకుని లేచేటప్పటికి పది అయింది.ఇవాల్టి ప్లాన్ నడుచుకుంటూ అంతా చూడాలి అని. వాతావరణం కూడా అద్బుతంగా ఉంది. చల్ల గాలి తో పాటు ఎండ.అదిరింది.

 

నీటికి కూడా డాన్స్ వచ్చు అని నాకు ఇది చూసిన తరువాతే తెలిసింది :

చికాగో నుండి లాస్ వేగాస్ దాకా ...చికాగో నుండి లాస్ వేగాస్ దాకా ...
వెనకాల కనిపిస్తున్నది – బెల్లాజియో అని కాసినో పేరు. దీని ముందు ఓక పెద్ద ఫౌంటైన్ ఉంటుంది. ప్రతి అరగంటకు ఓక పాట వినిపిస్తుంటారు. వెంటనే, నీరు డాన్స్ చేయడం మొదలెడుతుంది. అందమయిన వాతావరణం లో, అందమయిన పాట వింటూ చూడడం అద్బుతం.

అలాగే, మరి కొన్ని ఫోటోలు :

ab6a7-dscn1221
Enter a caption

ఈఫిల్ టవర్ కాదు !!

చికాగో నుండి లాస్ వేగాస్ దాకా ...

fa53f-orkut
Enter a caption

లాస్ వేగాస్పగలురాత్రి

 

అలా చూస్తూ ఉండగానే చీకటి పడిపోయింది. కొన్ని చోట్ల మాటల్లో చెప్పలేనిది, ఫోటోలు చెబుతాయి. అలాగే ఓక సర్కస్ కూడా చూసాం. బావుంది. మళ్లీ కాసినోలలోకి ఎంటర్. బేసిక్ గా మన దగ్గర డబ్బులు లేకపోయినా , మిగతా వాళ్ళ ఆటలు చూసి ఎంజాయ్ చేయొచ్చు. నేను అయితే, ఆదివారం రాత్రి మూడు గంటలకు పడుకుండి పోయాను. మిగతా వాళ్ళు ఏ అయిదు గంటలకో వచ్చారు.

అంతే , అయిపోయింది. టైం అయిపోయింది. మొత్తమంతా చూడకుండానే, సోమ వారం తిరుగు ప్రయాణం మొదలు పెట్టాల్సి వచ్చింది. సోమవారం ఉదయం పదకొండు గంటలకు బయలుదేరాం . మళ్లీ వచ్చిన దారిలోనే తిరుగు ప్రయాణం.మరి కొన్ని, అద్బుతమయిన కొండలను చూసాను :

ఈ సారి చికాగో రావడానికి, ముప్పయి ఆరు గంటలు పట్టింది. జితన్, వంచి ఇద్దరూ అలసి పోయారు. మంగళవారం ఉదయం మూడు గంటలకు కారును ఎక్కడో ఆపేసి, అందరం పడుకుండిపోయాం. వచ్చేటపుడు చూడాలి, మళ్లీ డెన్వర్ దగ్గర, మంచు లో తడిచిన కొండలు. అద్బుతం. ఈసారి ఎప్పుడయినా అక్కడకు వెళ్ళాలి, చలికాలం లో, కారు వేసుకుని.వంచి డ్రైవ్ చేస్తున్నాడు. నిద్ర వస్తుందేమో. కారు రోడ్డు చివరకు వెళ్ళిపోతుంది. నాకు టెన్షన్ మొదలయింది. అందుకే సరిగా చూడలేకపోయాను.

అలా , అలా వచ్చేటప్పటికి మంగళ వారం రాత్రి పది గంటలు అయింది. కథ కంచికి … మనం ఇంటికి … నాకు అనిపించింది … ముందు డ్రైవింగ్ నేర్చుకోవాలి … అద్బుతమయిన నికాన్ కెమెరా కొనాలి అని…

 

జితన్, శ్రీకాంత్, వంచి

One response to “చికాగో నుండి లాస్ వేగాస్ దాకా …”

  1. మీ ప్రయాణానుభవాలు కళ్లకు కట్టినట్లు చూపారు. ఈ సారి వెళ్లినప్పుడు Dance show -Jubilee at Bally's Hotel, Las Vegas చూడటం మరువవొద్దు. ఒక గొప్ప అనుభూతిని కోల్పోతారు. Word verification తీసివెయ్యగలరు.

Leave a comment