మనం సాధారణ మనుష్యులం కదా … మనసు మన మాట వినదు. రేపటి గురించి తెలుసుకోవడానికి జాతకాలు, గ్రహాలూ, ఇటువంటివన్నీ చూసేస్తూ ఉంటాం. ఇదంతా నాణేనికి ఓక వైపు మాత్రమే. అసలు ఎక్కడో ఉన్న గ్రహాలను చూసి, వాటి గమనాన్ని బట్టి ఇలా జరగోచ్చు అని చెప్పడం గొప్పే కదా ! కొన్ని సార్లు ఇది జరగోచ్చు, లేకపోచ్చు. కొంతమంది కి నమ్మకం ఉండొచ్చు, లేకపోచ్చు. కాని, ఇది కూడా ఒక సైన్సే.
మన తత్వవేత్తకు వీటి మీద చాల ఇంట్రెస్ట్ ఉంది. నేను ఈ తత్వవేత్తకు పిచ్చి, పిచ్చి గా నమ్ముతాను. కానీ మరీ అంతే పిచ్చోడిని కాదు. మన జాతకం బట్టి, మనం వచ్చే జనవరి వరకు అమెరికా లోనే ఉంటాం. ఫిబ్రవరి లో పెళ్లి అవుంతుంది చందమామ లాంటి అమ్మాయితో. అమెరికా సంగతి ఏమో కానీ, చందమామ మీద చాలా ఆశలే పెట్టుకున్నాను నేను. ఒక వేళ అది జరగక పొతే, లేదు … లేదు … జరుగుతుంది అని నమ్ముతున్ననే నేను. సో, వేరే ఆలోచనలు అనవసరం.
చూద్దాం … ఏమి జరుగుతుందో … నమ్మడం వల్ల మనకు పోయినదేమీ లేదు కదా !!!
Leave a comment