అమెరికా లో ఏంటంటే ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది. అది లక్జరీ కాదు, అవసరం. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ చాలా తక్కువ … కారు లేకపోతె కాళ్ళు లేనట్టే !!! కారు కొనే ఆలోచనలేవీ లేకపోయినా ఒక రోజు మంచి కారు అద్దె కు తీసుకుని, బావ దగ్గరకు వెళ్ళాలి అని ఒక చిన్న కల … ఇంకొకటి ఇక్కడి రోడ్లు అద్బుతం. ఎక్కువ దూరం కారులో వెళితే బాగా ఎంజాయ్ చేయొచ్చు.
నిన్ననే డ్రైవింగ్ స్కూల్ కు కాల్ చేసి ఇవాళ ఎనిమిది గంటలకు స్లాట్ బుక్ చేసాను. ప్రోదున్నే ఏడు గంటలకు లేచి చూసాను కదా మంచు కురుస్తుంది. అనుమానం వచ్చింది – ఏమి అవుతుందో అని. ఎనిమిది కల్లా కాల్ వచ్చింది రెనట దగ్గరనుండి. ఆమె నా ఇన్ స్ట్రక్టర్. ఇక్కడ కారు నేర్చుకోవాలి అంటే ముందు పర్మిట్ తీసుకోవాలి టెస్ట్ రాసి. అది మొన్నే అయింది. వెళ్లి పలకరించి, సీట్ బెల్ట్ పెట్టుకుని కూర్చున్నాను. ఒక రెసిడెన్షియల్ ఏరియా కు తీసుకువెళ్ళి ఆపింది. నన్ను డ్రైవింగ్ సీట్ లో కూర్చోమని చెప్పడం మొదలెట్టింది. కారు వెనక పార్ట్ ను అద్దం లో చూడడం, గేర్లు, స్టీరింగ్, బ్రేక్, అన్నీ చెప్పింది. ఇక తోలడమే తరువాయి.
దేవుడిని తలచుకొని బ్రేక్ మీద కాలు వేసి, గేరు మార్చి బ్రేక్ మీద కాలు తీసేసాను. కారు నెమ్మదిగా వెళ్ళడం మొదలెట్టింది. అప్పుడు పెడల్ మీద కాలు వేసి, స్పీడ్ పెంచడం మొదలెట్టాను. రెసిడెన్షియల్ ఏరియా కదా ఇరవై మైళ్ళ కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. రోడ్డు ఏ మలుపులు లేకుండా ఉంటే వెళ్ళిపోతాం. కానీ మలుపులు ఉన్న చోటే నేర్చుకోవాలి. రైట్ టర్న్ తీసుకుంటూ, లెఫ్ట్ టర్న్ తీసుకుంటూ సిగ్నల్స్ ఇచ్చుకుంటూ, అద్దంలో చూస్తూ, ఆమె చెప్పేవి వింటూ, మెయిన్ రోడ్డు లో కూడా నడిపి చూసేటప్పటికి టైం అయిపోయింది. కొన్ని సార్లు ఇబ్బంది పడ్డాను. కాని ఓకే.
నెక్స్ట్ క్లాసు బుధవారం. ఆమెకు అరవై డాలర్లకు చెక్ ఇచ్చి బై చెప్పి వచ్చేసా. అరవై డాలర్లంటే మన డబ్బులో రెండు వేల ఏడు వందల రూపాయలు. మన కంపెనీ ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాది కాబట్టి సరిపోయింది కాని లేక పొతే మనకు మన డబ్బులు పెట్టి కారు నేర్చుకునే సీన్ లేదు. అదీ సంగతి. నాకు యెంత వీలయితే అంత తొందరగా నేర్చేసుకుని బావ దగ్గరకు వెళ్లిపోవాలి అని ఉంది. చూడాలి … ఏమవుతుందో …
Leave a comment