ఈ మధ్యనే యు ట్యూబ్ లో ఒక క్లిప్ చూసాను – రాయలసీమ రామన్న చౌదరి సినిమా లోనిది. మోహన్ బాబు చంద్ర మోహన్ ను అడుగుతాడు – అసలు జనాలంతా దేవుడికి మొక్కుతున్నది దేవుడి మీద భక్తి తో కాదు అని. తాము పెట్టింది దేవుడు తినేస్తాడు అంటే అంటే ఎవడు గుడికి వెళ్ళడు, గుండు చేయించుకున్న తరువాత జుట్టు రాదు అని తెలిస్తే ఎవరయినా గుండు కొట్టించుకుంటారా అని. నిజమే కదా అనిపించింది. అది ప్రక్కన పెడితే మోహన్ బాబు యాక్షన్ అద్బుతం. నేను గుడికి వెళ్ళింది భక్తితో కాదు. అక్కడ దొరికే ఫుడ్డు గురించి. అంటే నాకు భక్తి లేదు అని కాదు. దేవుడిని నమ్ముతాను. పొద్దున్నే లేచి దేవుడికి గుడ్ మార్నింగ్ చెబుతాను కాని గుడికి వెళ్ళడం తక్కువే. కాని అదేంటో గుడికి వెళితే అదోరకమయిన ఫీలింగ్ వచ్చేస్తుంది.
చిన్నప్పుడు తెగ కోరికలు కోరుకునేవాడినిలే. కాని తరువాత అనిపించింది – నీకు ఏది మంచిదో నిన్ను పుట్టించిన దేవుడికి తెలియదా ? అని. అటువంటప్పుడు మళ్లీ కోరుకోవడం దేనికి. జస్ట్ ఒక నమస్కారం పెడతాను అంతే.
సరే, మొత్తం అందరిని దర్శించుకుని కిందకు వచ్చాం – కాంటీన్ లోకి. ఇక దండయాత్ర మొదలెట్టాలి. నాకు తెలిసి అమెరికా వచ్చిన తరువాత తిన్న బెస్ట్ ఫుడ్డు లో ఇక్కడ దొరికేది ఒకటి. రెండు ప్లేట్లు వడ, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ పోలిహోర, రెండు గ్లాసులు లస్సి . ఇది మన మెను. నేనే కాదు, చాలామంది ఇక్కడ దొరికే ఫుడ్డు కోసమే వస్తారట. దేవుడా – థాంక్స్. ఇక్కడకు రావడం ఇది రెండో సారి.



Leave a comment