కారు నేర్చుకోవడం మొదలెట్టి ఏప్రిల్ ఇరవై ఒకటికి నెల రోజులు అవుతుంది. అప్పటికి పన్నెండు క్లాసులు తీసుకున్నాను. ముందు రోజే బావ చెప్పాడు – చందమామ కర్కాటకం లో ఉంది. నువ్వు కళ్ళు మూసుకుని నడిపినా నీకు లైసెన్సు వస్తుంది అని. ఈ మాట చాలు – ఎక్కడ లేని కాన్ఫిడెన్సు వచ్చేసింది. అంటే డ్రైవింగ్ కష్టం అని కాదు. ఫస్ట్ టైం కదా కొంచం భయం గా ఉంటుంది. తీరా టెస్ట్ లో సరిగా నడపలేదు. దొబ్బేసింది. అరే ఇలా అయిందేమిటి అని అనుకున్నాను. తరువాత తెలిసింది – అయిదు సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారని. అంతే, మళ్ళా మామూలే.
నాకు తెలిసింది – మనం చేసే ప్రాక్టీసు సరిపోదు అని. కారు రెంట్ కు తీసుకుని ప్రాక్టీసు చేద్దామంటే కొంచం కష్టం. ఎందుకంటే, మన ప్రక్కన అమెరికా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు కూర్చోవాలి. జయతీర్థ్ గారు సరే, నేను ఉన్నాను కదా అన్నారు. అంతే, నిస్సాన్ సెంట్రా రెండు రోజులు తీసుకున్నాను. నా ఆలోచన ఒక్కటే. ఈ రెండు రోజులలో కనీసం మూడు వందల మైళ్ళు నడపాలి. మొత్తం మీద అక్కడకు, ఇక్కడకు, ఎక్కడకో నడిపెసాను. ఈ సారి మళ్లీ కాన్ఫిడెన్సు వచ్చేసింది.
రెనట చెప్పింది – ఏప్రిల్ ముప్పైన మళ్లీ టెస్ట్ కు వెళ్దామని. సరే, ఉదయం ఎనిమిది కల్లా డి.ఎం.వి ఆఫీసు కి వెళ్ళాం. మొదలయింది – ఎక్జామినర్ కు ఒక ఎనబై ఏళ్ళు ఉంటాయేమో. అలా వెళ్ళు, ఇలా వెళ్ళు అని చెప్పింది. ఫైనల్ గా, నువ్వు బాగా డ్రైవ్ చేసావు అని చెప్పింది. అంటే, అమెరికా లైసెన్స్ వచ్చేసింది. తనతో స్టార్ బక్స్ కు వెళ్దాం అనిపించింది. కారుకు ఫోటో తీయాలి అనిపించిది. కాని, లేట్ కావడం తో “డ్రైవ్ సేఫ్ లీ ” అని చెప్పి వెళ్ళిపోయింది …
అదీ మన లైసెన్స్ కదా … ఇప్పుడు నేను ఎవరి మీద ఆధారపడనవసరం లేదు … ఎక్కడికయినా వెళ్లిపోవచ్చు … నా లైసెన్స్ నే చూస్తూ కూర్చున్నాను. ఆఫీసు లో పని చేయబుద్ది కాలేదు … చేయలేదు …
రమేష్ గారి ఫ్యామిలీని, జయతీర్థ్ గారిని, సునీల్ గారిని తీసుకెళ్ళి నపుడు తీసిన ఫోటో లు –
స్వామి నారాయణ్ టెంపుల్, బార్ట్ లెట్, ఇల్లినాయిస్ అండి
ఈ చిత్రాలలో ఉన్న దేవాలయం ఊరేమిటి? పేరేమిటి?
cbrao
Mountain View (CA)