డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన దగ్గర నుండి కారు ఎప్పుడు నడుపుతామా, అంతా ఎప్పుడు చూస్తామా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రోడ్లు అంత అందంగా, సొగసుగా ఉంటాయి మరి … ఇక్కడకు వచ్చిన కొత్తలో రూం కే అతుక్కుని ఉండేవాడని … ఇప్పుడు శనివారం వస్తే చాలు ఎక్కడకు వెళ్తామా అనిపిస్తుంది. జయ తీర్థ్ గారిని అడిగాను – ఈ వారం ఎక్కడకు వెళ్తున్నాం అని. ఆయన చెప్పాడు – రమేష్ ఫ్యామిలీ, నేను, హరి కలసి హాలాండ్ వెళ్తున్నాం అని. అక్కడ ట్యులిప్ పూల తోటలు ఉంటాయట. నేను వస్తాను అని చెప్పాను. లేదు నాయనా, కారు సరిపోదు అని చెప్పారు. అరరే అనిపించింది. కాని రాత్రి ప్రొడక్షన్ ఇష్యూ ఉండడం తో ఐదు వరకు పడుకోలేదు. ఒక గంట పడుకున్నానో లేదో, కాల్ వచ్చింది – రెడీ అవ్వు, మనం వెళ్తున్నాం అని. నిద్ర లేకపోయినా బయలుదేరాను.
అక్కడ ఏదో ఫెస్టివల్ అవుతుంది. మధ్యలో ఒకచోట ఆగి పులిహోర తిని, పప్పు తో చపాతీ తిని, స్టార్ బాక్స్ లో కాఫీ తాగి,
వెళ్తుంటే అదో అనందం. ఇండియానా దాటి, మిచిగాన్ లో కి వెళ్ళాలి. ఒక రెండు వందల యాభై మైళ్ళ ప్రయాణం. బావుంది. మధ్యాహ్నంకి అక్కడకు చేరుకున్నాం







Leave a comment