నేను ఉండే ప్లేస్ కు ఒక నలభై మైళ్ళ దూరం లో లేక్ జెనీవా అని ఉంది. ఇంతకు ముందు లేక్ లు అంటే చిన్న, చిన్నవి అనుకునేవాడిని. కాని ఇక్కడకు వచ్చిన తరువాత తెలిసింది అవి యెంత పెద్దగా ఉంటాయో. ఇవాళ శనివారం కదా. ముందు డౌన్ టౌన్ వెళ్దాం అనుకున్నాం. కాని మా చెత్త గాళ్ళు ఉన్నారు కదా ప్రోగ్రాం చెడగొట్టారు. రూం లో ఉండిఏం చేయాలో తెలియడం లేదు. మొత్తానికి సరదాగా అలా... Continue Reading →
పడమటి సంధ్యా రాగం …
ఇప్పుడే ఆఫీసు నుండి వచ్చాను. వేసవి కాలం కదా, తొమ్మిదవుతున్నా ఇంకా చీకటి పడలేదు. సూర్యుడు ఈ రోజుకిక బై అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ప్రపంచం చాలా అందం గా ఉంది. మనసు బావుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఇవాళ భలే ఉంది. ఉదయం నుండి వర్షం పడి ఆకాశం ఒక ప్రక్క మబ్బుగా ఉంది, మరో ప్రక్క ఎండగా ఉంది.
అందాల చికాగో …
మన దగ్గర ఏమయినా ఉన్నప్పుడు వారి/దాని విలువ తెలియదు. వాటి గురించి అంతగా ఆలోచించం. ఇవి మన దగ్గరున్న వస్తువులు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్చు, మన చుట్టూ ఉన్న ప్రదేశాలు కావచ్చు. నేను ఇక్కడికి వచ్చి పది నెలలు అయినా చికాగో డౌన్ టౌన్ ఇప్పటివరకూ చూడలేదు. చాలా బావుంటుంది అంట - చివరికి నిన్న కుదిరింది. కారుని రైల్వే స్టేషన్ లో పార్క్ చేసి, మెట్రా ట్రైన్ లో బయలుదేరాం. ఇక్కడ ఇప్పుడు... Continue Reading →
నచ్చింది …
నిన్ననే ఇప్పటి వరకూ ఉంటున్న హోటల్ ఖాళీ చేసి వుడ్ ల్యాండ్ క్రీక్ కు వచ్చాను. రూం నంబర్ మూడు వందల పదహారు. ఇప్పటికే సజ్జన్, జీతాన్, రితబ్రత, దీపేష్ ఉంటున్నారు. డబల్ బెడ్రూం కదా. రెండు రూం ల లోను సర్దేసుకున్నారు. నాకు వేరే ఎక్కడికి వెళ్ళడానికి కుదరక ఇక్కడకు వచ్చేసాను. వచ్చే ముందు రాకూడకు అనుకున్నాను కాని, వచ్చాక నచ్చింది. నిన్న రాత్రి వరకూ పని చేసాను. రెండున్నర, మూడు అయింది. నేను హాల్... Continue Reading →
రూం నంబర్ 229
అమెరికా వచ్చి ఇవాల్టికి పది నెలలు అయింది. వచ్చే ముందు "కాండిల్ వుడ్ సూట్స్" లో రూం తీసుకున్నానని జీతాన్ చెప్పాడు. సింగిల్ రూం, బాత్ రూం, వండుకోడానికి స్టవ్, అన్నీ ఉన్నాయి. ఒక్క రూం లో ఇద్దరు. కాని ఇక్కడ పది నెలలు ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే భలే ఆశ్యర్యం గా ఉంటుంది. రూం ని ఎప్పుడూ నీట్ గా పెట్టుకోలేదు. ఇవాళ ఖాళీ చేసి వస్తుంటే ఏదోలా అనిపించింది.... Continue Reading →
సుబ్బలక్ష్మి …
నిన్ననే బాణం సినిమా చూసాను. ఇది బావుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఒక బ్లాగులో చదివి బావుంది అనిపించి చూసాను. హీరో బావున్నాడు. తక్కువ మాటలు. నాకు హీరో కన్నా, సినమా కన్నా వేదిక కారక్టర్ చాలా నచ్చింది. సుబ్బలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి. సినిమా లో ఈమె తక్కువ సీన్లలోనే ఉన్నప్పటికీ, ప్రతీ సీన్ చాలా బావుంది. ఇంట్రడక్షన్ సీన్ లో పచ్చడి అడగడం, భోజనం చేసేటప్పుడు గుడ్డు వెజిటేరియన్ ఫుడ్ అంటే, గుడ్డు లోంచి పిల్ల... Continue Reading →
చాలా బాగుంది …
కారు నడపుతానని, కారు కొంటానని నాకు ఎప్పుడూ కలలూ లేవు, ఆలోచనలూ లేవు. అది పెద్ద విషయం కాకపోవచ్చు. నాకు మాత్రం ఊహించని విషయమే. బావ హైదరాబాదు వెళ్ళిపోతున్నాడు. చివరివరకూ తన కారు తీసుకోవాలని ఆలోచన లేదు. బహుశా మే చివర్లో వెళ్ళిపోతాను అన్న ఆలోచన కావచ్చు. కాని అభిషేక్ చెప్పాడు నువ్వు ఇక్కడ ఆగస్ట్ వరకూ ఉంటావు అన్నాడు. వెంటనీ తనకు కాల్ చేసాను. నీ కారు నేను తీసుకుంటున్నాను అని. కాని ఎన్నో అలోచనలు... Continue Reading →