కారు నడపుతానని, కారు కొంటానని నాకు ఎప్పుడూ కలలూ లేవు, ఆలోచనలూ లేవు. అది పెద్ద విషయం కాకపోవచ్చు. నాకు మాత్రం ఊహించని విషయమే. బావ హైదరాబాదు వెళ్ళిపోతున్నాడు. చివరివరకూ తన కారు తీసుకోవాలని ఆలోచన లేదు. బహుశా మే చివర్లో వెళ్ళిపోతాను అన్న ఆలోచన కావచ్చు. కాని అభిషేక్ చెప్పాడు నువ్వు ఇక్కడ ఆగస్ట్ వరకూ ఉంటావు అన్నాడు. వెంటనీ తనకు కాల్ చేసాను. నీ కారు నేను తీసుకుంటున్నాను అని. కాని ఎన్నో అలోచనలు . నయాగరా నుండి చికాగో వరకూ అంటే కనీసం ఆరు వందల యాభై మైళ్ళు దూరం. ఎప్పుడో పందోమ్మిదొందల తొభై తొమ్మిది కారు, నీకు లైసెన్స్ వచ్చి కనీసం నెల కూడా కాలేదు, హై వే మీద నువ్వొక్కడివే రావాలి, ఎవరూ ఉండరు, దారిలో కారు ఆగిపోతే ఏమి చేస్తావు, నీకు ఆక్సిడెంట్ అయితే ఏమిటి పరిస్థితి, నువ్వు రిస్క్ చేస్తున్నావు, వద్దు, వద్దు అని రకరకాలుగా బయపెట్టారు.
ఇటువంటి పరిస్థితులలో మాములుగా డ్రాప్ అయిపోతాం. కాని లేదు నువ్వు డ్రైవ్ చేయగలవు, కారు తీసుకో అని చెప్పినవాడు ఒకరు జయతీర్థ్, రెండు బావ. అదీ కాక ఒక్కడినే కారు నడుపుకుంటూ ఎక్కడికో వెళ్లిపోవాలి, అంతా తిరిగేయాలి అని ఒక కోరిక. కనీసం పదమూడు గంటల ప్రయాణం. మధ్యాహ్నం పన్నెండుకు బయలుదేరి , రాత్రి ఒంటిగంటకు వచ్చాను. ఎక్కడలేని కాన్ఫిడెన్సు వచ్చేసింది.
కారు వచ్చిన దగ్గర నుండి నాకు బాగుంది అనిపిస్తుంది. ఎవరిమీద డిపెండ్ కానవసరం లేదు. ఎక్కడికి కావాలంటే అక్కడకు వెళ్ళొచ్చు. రోజూ స్టార్ బక్స్ లో కాఫీ తాగాలి. కే.ఎఫ్.సి. లో చికెన్ తినాలి. బీచ్ కు వెళ్లి ఉదయించే సూర్యుడి ని చూడాలి. ఎప్పడు పడితే అప్పుడు ఆఫీసు నుండి రావాలి, రాత్రి పన్నెండుకు వెళ్లి కాఫీ తాగాలి . ఇవన్నీ నా కోరికలు ఇంతకు ముందు. మనకు నచ్చినవి చేస్తుంటే ఆ మజా బానే ఉంటుంది. అసలు ఆఫీసు నుండి ఎప్పుడు వెల్లిపోతామా, ఊరంతా ఎప్పుడు తిరుగుతామా అనిపిస్తుంది. బహుశా మొదటి రోజులు కదా. అందుకేమో, ఏమో ??
ఎందుకో అనిపిస్తుంది, ఈ మధ్య నేను సరిగా పని చేయడం లేదు అని. నాకు క్లియర్ గా తెలుస్తుంది. ఇంట్రెస్ట్ గా చేయడం లేదు. చూడాలి. ఇప్పటివరకూ నేను చూసిన అమెరికా చాలా బావుంది.
🙂
బాగుందబ్బాయ్!