నిన్ననే బాణం సినిమా చూసాను. ఇది బావుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఒక బ్లాగులో చదివి బావుంది అనిపించి చూసాను. హీరో బావున్నాడు. తక్కువ మాటలు. నాకు హీరో కన్నా, సినమా కన్నా వేదిక కారక్టర్ చాలా నచ్చింది.
సుబ్బలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి. సినిమా లో ఈమె తక్కువ సీన్లలోనే ఉన్నప్పటికీ, ప్రతీ సీన్ చాలా బావుంది. ఇంట్రడక్షన్ సీన్ లో పచ్చడి అడగడం, భోజనం చేసేటప్పుడు గుడ్డు వెజిటేరియన్ ఫుడ్ అంటే, గుడ్డు లోంచి పిల్ల వస్తుంది, తోటకూర లోంచి రాదు కదా అనడం, ఈ రోజు ఉపవాసం ఉంటున్నాను, బయటకు తీసుకు వెళ్లి అట్టు తినిపించొచ్చు కదా అనడం, పోలీసు ఎందుకు, కలెక్టర్ కావచ్చు కదా కోటు వేసుకోవచ్చు అనడం, ఆ మాట తీరు, అమాయకత్వం భలే ముచ్చటగా ఉంటుంది.
ఈ కాలం లో ఇటువంటి వాళ్ళు ఉంటారా ?? ఉంటే బావుంటుంది. చూసిన సీనే మళ్లీ, మళ్లీ చూస్తున్నాను. అప్పుడెపుడో బొమ్మరిల్లు లో జెనీలియా, ఇప్పుడు ఈ అమ్మాయి – బావున్నారు.
Leave a comment