మన దగ్గర ఏమయినా ఉన్నప్పుడు వారి/దాని విలువ తెలియదు. వాటి గురించి అంతగా ఆలోచించం. ఇవి మన దగ్గరున్న వస్తువులు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్చు, మన చుట్టూ ఉన్న ప్రదేశాలు కావచ్చు. నేను ఇక్కడికి వచ్చి పది నెలలు అయినా చికాగో డౌన్ టౌన్ ఇప్పటివరకూ చూడలేదు. చాలా బావుంటుంది అంట – చివరికి నిన్న కుదిరింది.
కారుని రైల్వే స్టేషన్ లో పార్క్ చేసి, మెట్రా ట్రైన్ లో బయలుదేరాం. ఇక్కడ ఇప్పుడు సమ్మర్. జనాలంతా అబ్బాయిలు, అమ్మాయిలు కూడా సరిగా బట్టలు వేసుకోకుండా తిరిగేస్తూ ఉంటారు. నిన్న టైం అంత బాలేదు. ట్రైన్ కొంచం లేట్. మా ఫ్రెండ్ ఒకడు తన ఆఫీసు అడ్రస్ వెతకాలి అంటే టైం అంతా దాని కోసమే సరిపోయింది. చూసింది ఏంటంటే పెద్ద, పెద్ద బిల్డింగ్స్ , మిచిగాన్ లేక్, మిలీనియం పార్క్ అంతే. చీకటి పడిపోయింది.
వెళ్తుంటే ఒక చోట కాళ్ళు ఆగిపోయాయి. కళ్ళు ఒక చోట నిలిచిపోయాయి. ఆ మూమెంట్ బావుంది. కారణం ఈ ఫోటో –
అపుడెపుడో పేపర్ లో చదవడమే – అక్కడెక్కడో గాంధీ విగ్రహం పెట్టారు, ఆ వీధికి వీరి పేరు పెట్టారు అని. కాని ఇప్పుడు అమెరికా లో వివేకానందుడి పేరు చూసేసరికి భలేగా అనిపించింది. అప్పుడు గుర్తుకు వచ్చింది – ౧౯౩౦ లలో ఆయన ఇక్కడకు వచ్చిన సంగతి.
అపుడెపుడో పేపర్ లో చదవడమే – అక్కడెక్కడో గాంధీ విగ్రహం పెట్టారు, ఆ వీధికి వీరి పేరు పెట్టారు అని. కాని ఇప్పుడు అమెరికా లో వివేకానందుడి పేరు చూసేసరికి భలేగా అనిపించింది. అప్పుడు గుర్తుకు వచ్చింది – ౧౯౩౦ లలో ఆయన ఇక్కడకు వచ్చిన సంగతి.అలా ముందుకు వెళుతూ మిలీనియం పార్క్ కు వెళ్ళాం. ఇది ఒక పెద్ద పార్క్ లా ఉంది. ఒక ప్రక్క సింఫనీ జరుగుతూ ఉంది. జనాలంతా కూర్చున్నారు.
అక్కడ తీసిన కొన్ని ఫోటో లు :
ప్రక్కనే లేక్ మిచిగాన్.
బేసిక్ గా ఇంత పెద్ద మేడలు, ఇంత అందమయిన లేక్ లు లైఫ్ లో ఇంత వరకూ చూడలేదు కదా … అందుకే బావుంది … నిజం చెప్పాలి అంటే ఏమి చూడలేదు అనే చెప్పాలి. కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి.







పక్కనే మా ఊరు డెట్రాయిట్ కి కూడా వచ్చేయ్!