నేను ఉండే ప్లేస్ కు ఒక నలభై మైళ్ళ దూరం లో లేక్ జెనీవా అని ఉంది. ఇంతకు ముందు లేక్ లు అంటే చిన్న, చిన్నవి అనుకునేవాడిని. కాని ఇక్కడకు వచ్చిన తరువాత తెలిసింది అవి యెంత పెద్దగా ఉంటాయో. ఇవాళ శనివారం కదా. ముందు డౌన్ టౌన్ వెళ్దాం అనుకున్నాం. కాని మా చెత్త గాళ్ళు ఉన్నారు కదా ప్రోగ్రాం చెడగొట్టారు. రూం లో ఉండిఏం చేయాలో తెలియడం లేదు. మొత్తానికి సరదాగా అలా బయటకు వెళ్ళడానికి ఒప్పించాను. ముందు లేక్ జెనీవా కు వెళ్దాము అని అనుకోలేదు గాని, అలా అలా వెళ్ళిపోయాం – పాటలు వింటూ, మాట్లాడుకుంటూ.
మా వాళ్ళు ముందు అంత ఇంటరెస్ట్ చూపెట్టలేదు కాని, అక్కడకు వెళ్ళిన తరువాత తమ కెమెరాలకు పని చెప్పారు. విషయం ఏమిటి అంటే వేసవి కదా. అందరూ బికినీలు వేసుకుని స్నానాలు చేసేస్తూ ఉంటారు. వాళ్లకు అది అంత పెద్ద విషయం కాకపోవచ్చు కాని మన కళ్ళకు పండగే. ఇది తప్పో, ఒప్పో నాకు తెలియదు కాని వాళ్ళ అందాన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. ఇక్కడకు వచ్చే ముందు బావ చెప్పాడు – ఇక్కడ చాలామంది అమ్మాయిలు శిల్పం చెక్కినంత అందం గా ఉంటారు అని. అది నిజమే అనిపిస్తుంది. కళ్ళు అప్పగించి వాళ్ళనే చూస్తూ ఉంటాము. ఎవరూ మనల్ని చూడకుండా వాళ్ళ ఫోటోలు తీస్తూ ఉంటాము – తప్పు అని తెలిసినా. అందరూ ఇలా ఉండరు. ఇదీ నా అభిప్రాయం. తప్పు అయితే కావచ్చు. నేను చెప్పినది కొంత మందికి నచ్చకపోవచ్చు. కాని అది ఓకే.
లేక్ జెనీవా కొన్ని ఫోటోలు :



లేక్ జెనీవా మాకు ఇంకా దగ్గర. మాకు 15 నిమిషాల ప్రయాణం. కొన్నిసార్లు గడిపివచ్చాము.
మీ వివరాలు తెలియడం లేదు – ప్రొఫయిల్ లేదు కనుక. మీకు కలవాలనే ఆసక్తి వుంటే sarathn at hotmail dot com కి ఈమెయిల్ ఇవ్వండి.