మహార్ణవం

చిన్నప్పుడు లైఫ్ భలే ఉండేది. ప్రతి రోజు స్కూల్ అయిపోగానే లైబ్రరీ కి వెళ్లి పేపర్ తిరగేసే వాడిని. చందమామ, చిన్నారి లతో పాటు స్వాతి కూడా తిరగేసేసే వాడిని. సరసమయిన కథల సంగతి గుర్తు లేదు కాని సీరియల్స్ బాగానే చదివేవాడిని. టైం కరెక్ట్ గా తెలియదు కాని కనీసం పది సంవత్సరాలు అయి ఉంటుంది – మహార్ణవం అనే సీరియల్ మాత్రం చాలా బాగా ఉండేది. సినిమా భాష లో చెప్పాలంటే స్నేహం, ప్రేమ, ప్రతీకారం ఉండే యాక్షన్, లవ్ స్టొరీ.

ఒక ఊరి లో ముగ్గురు భూస్వాములు ఉంటారు – సుబ్బయ్య, సీతా రామయ్య, మూడో వాడి పేరు గుర్తు లేదు. అదే ఊర్లో వాసు, శివ అని ప్రాణ స్నేహితులు ఉంటారు. శివ వైజాగ్ ఆంధ్ర యునివర్సిటీ లో చదువుతూ ఉంటాడు. ఇక్కడ వాసు ఒక భూస్వామి కూతురిని ప్రేమిస్తాడు. అది తెలిసిన వాళ్ళు ఒక స్వామీజీ సాయంతో భయంకరమయిన వర్షం పడేరోజు, ఊరి చివర భయంకరంగా చంపేస్తారు. శివ కూడా ఒక బూస్వామి కూతురి ఉమ ప్రేమించుకుంటారు. శివ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు, ఎలా తప్పించుకున్నాడు అన్నదే కథ.

కథ ఎలా మొదలవుతుందంటే బస్సు వెళుతూ ఉంటుంది. అదే సమయానికి రోడ్డు ప్రక్కన సుబ్బయ్య నడుస్తూ ఉంటాడు. డ్రైవర్ కి ఒకేసారి చేతి నరాన్ని ఎవరో తిప్పేసినట్లు అనిపిస్తుంది. బస్సును కంట్రోల్ చేయలేక సుబ్బయ్యను గుద్దేస్తాడు. కథ వర్ణించడం మహా అద్భుతంగా ఉంటుంది. తరువాత ఒక్కొక్కడినీ ఒక్కోలా ప్లాన్ వేసి చంపుతాడు. చివరికి వీడే అని తెలిసిపోతుంది. కాని శివ, ఉమ తెప్పించుకుంటారు. నాకు ప్రతీ సన్నివేశం గుర్తుకు లేదు కాని, చాలా చాలా బావుంటుంది. అపుడపుడూ అనిపిస్తూ ఉంటుంది – స్వాతి పాత కాపీలు సంపాదించి మళ్ళీ చదవాలి అని. చూడాలి.

 చెప్పడం మరిచా – రైటర్ పేరు – కరిముల్లా ఘంటసాల.

One thought on “మహార్ణవం

Add yours

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑