ఏమి చదవాలి ?

అక్కడెక్కడో చదివాను – ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానం అని.  కాని మంచి పుస్తకం అంటే ఏమిటి ?  రకరకాల పుస్తకాలు ఉంటాయి కదా.  ఆలోచించాను – ఇప్పటివరకూ పెద్దగా ఏమి చదవలేదు కాని,  చదివిన వాటిలో ఏమి ఎంజాయ్ చేసాను  అని ??  స్వాతి లో వచ్చిన సీరియల్స్,  సరసమయిన కథలు తప్పితే ఇంకేమి చదవలేదు, కాని అవి బాగానే ఎంజాయ్ చేసాను.   ఈ మధ్య అనిపిస్తూ ఉంది … సినీమాలు,  యు ట్యూబ్,  బ్లాగులు అడిక్ట్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది.  ఎందుకో నచ్చట్లా. 

అలా కాఫీ తాగుదామని బయటకు వెళ్ళాను.  ప్రక్కనే బోర్డర్స్ బుక్ షాప్ కనిపించింది.  అదేంటో నాకు బుక్స్ కొనకపోయినా,  చదవకపోయినా బుక్ షాప్ లో తిరగడం ఇష్టం.  వెళ్ళాను, రకరకాల పుస్తకాలు.  నవలలు,  ట్రావెల్ కు సంబంధించినవి,  హెల్త్,  పెర్సనాలిటీ డెవలప్ మెంట్,  చిన్న పిల్లలవి,  హిస్టరీ, టెక్నాలజీ,  సైన్సు,  వంటలు … ఇంకా ఎన్నో, ఎన్నెన్నో.  రొమాంటిక్ గా ఉండేవంటే నాకిష్టం.  ఆలోచించాను – కొన్నా చదువుతానా ?  ఎటూ నిర్ణయం తీసుకోలేకపోయాను.   ఈ బుక్స్ చదవచ్చు కాని ఎందుకో చదివిన ఫీల్ రాదు.

అపుడెపుడో అల్కెమిస్ట్ చదివాను.  నచ్చింది.  సరే, అలాంటిది ఏమన్నా ఉంటుందేమోనని చూసాను. మళ్లీ ఎన్నో బుక్స్.  చివరకు ‘గాడ్ నెవర్ బ్లింక్స్’  అన్న బుక్ కొన్నాను.  బేసిక్ గా ప్రతి ఒక్కరి లోను పాజిటివ్స్, నేగేటివ్స్ రెండూ ఉంటాయి కదా.  ఇందులో  నాలో ఉన్న నేగేటివ్స్ ఉన్నట్లు అనిపించింది.  మళ్లీ ఆలోచించాను – చదువుతానా లేదా అని.  ఒక డెసిషన్ కు వచ్చాను.  ఇది కనుక చదవక పొతే ఇంకెప్పుడూ బుక్స్ కొనకూడదు అని.   చూడాలి,  ఏమి జరుగుతుందో ???

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑