లాప్ టాప్ కొన్నానోచ్ …

-మనం వెనక్కి వెళ్ళే రోజు దగ్గర పడింది. బేసిక్ గా అమెరికా కు వచ్చే ప్రతి ఒక్కడు లాప్ టాప్ పట్టుకు వెళ్తాడు – ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రేట్లు తక్కువ కదా.  ఇక్కడకు వచ్చిన కొత్తలో నాకు కొనే ఆలోచన ఏమి లేదు.  కాని అక్కడకు వెళ్తే అవసరం అయితే ఏమి చేయాలి.  సరే కొందాం అని అనుకున్నాను. కాని ఏమి కొనాలి. ముందు నుండి నాకు హెచ్. పీ. అంటే ఇష్టం.  కాని తీరా కొనేటప్పటికి నిర్ణయం మారిపోయింది.  డెల్ తీసుకుందామని అనుకున్నాను.  ఎక్స్. పీ. ఎస్ ౧౬ కొనాలనుకునాను. కాని అది పద్నాలుగు వందలు అవుతుంది.  i7  ప్రాసెసర్ .  ఆలోచించి, ఆలోచించి  vostro 3400 ఆర్డర్ చేసాను. అది i5 ప్రాసెసర్, 320 GB హార్డ్ డిస్క్,  4  gb  RAM .  బేసిక్ గా మన అవసరం ఏంటి అని ఆలోచించాను. గేమ్స్ ఆడడానికి కాదు,  సినిమా లు చూడడానికి కాదు.  జాబు మానేస్తున్నాం కదా,  ఏదయినా నేర్చుకోడానికి కంప్యూటర్ అవసరం. కొంచం Linux , కొంచం programming  చేయడానికి. దానికి  ఈ కాన్ఫిగరేషన్ సరిపోతుంది.

డెస్క్ టాప్ కన్నా, లాప్ టాప్ అయితే బెటర్. ఇవాళే ఇంటికి వచ్చింది.  మొత్తం ఎనిమిది వందల యాబై డాలర్లు అయింది.

కొనే ముందు దీని గురించి రకరకాల రివ్యూ లు చదివాను.  అంతా బానే ఉంది అన్నారు.  i5  స్పీడ్ మనకు సరిపోతుంది. కాని అనిపించింది. నెట్ లో చూసిన మోడల్ లాగ లేదు. కొంచం తేడా గ అనిపించింది.  ఇంకొక విషయం ఏమిటి అంటే ఇది 14 “”  స్క్రీన్. అంటే కొంచం చిన్నగా ఉంటుంది.  కాని నాకు నచ్చింది.  డెల్ కస్టమర్ సర్వీసు చాలా బావుంటుంది అట.  ఆర్డర్ చేసిన మూడవ రోజునే ఇంటికి వచ్చేసింది.   ఆఫీసు లో ఏ పనీ చేయబుద్ది కాలేదు. ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది అన్న ఆలోచనలే.  ఎందుకంటే ఈ


మోడల్ ఇప్పటి వరకూ చూడలేదు.  grey కలర్.  6 సెల్ బాటరీ. చూడాలి ఒక సంవత్సరం పొతే ఎలా పని చేస్తుందో. అప్పటి వరకూ ఉంటుందో లేదో.  

ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు – ఇంకొంచం డబ్బులు పెడితే  ఆపిల్  ఐ-మాక్ వస్తుంది అని. కాని నాకు ఎందుకో అది నచ్చదు. నన్ను మూర్ఖుడు అన్నారు. అవును అని చెప్పాను. 

5 thoughts on “లాప్ టాప్ కొన్నానోచ్ …

Add yours

  1. మీకు తెలిసే వుంటుంది… వీటిని లాప్టాప్ నుండి నోట్ బుక్ అని ఎందుకు మార్చారొ… మీరు లాప్ మీద ఉపయొగించకండి. కిందపెట్టే వాడుకొండి. :-))

  2. చదువరి గారూ 🙂 నేనో పదిహేను వందల డాలర్లు తగలేసి కొన్ని నెలల క్రితం హెచ్ పి లాప్ టాప్ కొన్నా, ఫుల్ లోడెడ్.

    దాని సిగతరగా, అదో ఫర్నేస్. కాళ్ళూ, వళ్ళూ కాలి పోతున్నాయి. దాని కోసం ఓ రెండు పాడ్ లు కొన్నా, ఫాన్ లతో. అదో అదనపు క్షవరం.

    ఇహ చివరకి నా వల్ల కాక, అదింట్లో పడేసి ఇంకోటి కొన్నా..లెనోవో, హీట్ ప్రాబ్లం లేదు కాద్ని, హెచ్ పి లో, ఎన్వీడియా గ్రాఫిక్స్ కార్డ్, బ్లూ రే డ్రైవ్ తో వచ్చే డిస్ప్లే క్వాలిటీ దీంట్లో రావట్లేదు కాని, ఇది చాలా మెరుగు అని డిసైడ్ అయిపోయా.

  3. హెచ్చిపీ కొనకుండా మంచిపనే చేసారని నేనంటాను. డెల్ దాని కంటే ఎంతో మెరుగు. శేఖర్ గారు చెప్పినట్టు డెల్ వలన మనం వేడెక్కం. హెచ్చిపీని మాత్రం ల్యాపుటాపుగా వాడలేం, తగని వేడి! అదొక డెస్కుటాపు, అంతే!

  4. అభినందనలు..
    డెల్ లాప్‌టాప్‌ ఎక్కువ వేడేక్కకుండా ఉంటుంది…అలానే తొందరగా హీట్ ‌డిసిపేట్ ఐపోతుంది…నా అనుభవం ఇది..మీ లాప్‌టాప్ ఎలా ఉంది ఈ విషయంలో…

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑