శరత్ గారిని కలవబోతున్నానోచ్ …

ఈ మధ్య తెలుగు బ్లాగులు ఎక్కువగానే చదువుతున్నాను.  అలానే శరత్ గారి కాలమ్ కూడా  … అపుడెపుడో ఏదో రాస్తే నేను కూడా ఈ దగ్గరలోనే ఉంటున్నాను. కలవాలి అనుకుంటే మెయిల్ చేయి అని చెప్పి id  ఇచ్చారు.  కాని ఎందుకో మెయిల్ చేయలేకపోయాను.  మరి కొన్ని రోజులలో వెనక్కు వచ్చేస్తున్నాను కదా,  కలుద్దాం అనిపించింది.  ఈ మధ్యాహ్నమే మెయిల్ చేసాను.  రిప్లై వచ్చింది – ఫోన్ నెంబర్ తో సహా.  కాల్ చేసాను.  విషయం ఏమిటి అంటే నేను నేను అని ఆయనకు తెలియదు.  బేసిక్ గా నేను ఎక్కువ ఏమి రాయను కదా. 

ఫోన్ చేస్తున్నపుడు కొంచం ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను.  ఎందుకంటే మనకు అంతగా పరిచయం లేని , ఇప్పటి వరకూ చూడని   నేను అంటే తెలియని వ్యక్తితో మాట్లాడుతుంటే ఇలానే ఉంటుందేమో.  ఈ మధ్యనే ఆయన తన బ్లాగ్ లో ఫోటో పెట్టారు.  నేను చూసి ఉండకపోతే బావుండేది.  రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది.  ఫోన్ ఎత్తారు – “హలో, శరత్ గారా అన్నాను. “.  అవును అని చెప్పి, మీరు “… ఆ”  అన్నారు.  “అరె, బానే చెప్పేసారు” అనుకున్నాను.  ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, కొత్త నెంబర్ వస్తే బహుశా నా నుండే అనుకుని ఉండవచ్చు.  మాటలలో తెలిసింది – మేము ఉండేది ఒకే ప్లేస్ లో అని,  ఒక మూడు మైళ్ళ దూరం లో.  భలేగా అనిపించింది.  అరె నిన్ననే మెయిల్ చేసి ఉంటే, ఈ రోజు కలసి ఉండే వాడిని అనుకున్నాను.  ఎక్కడ ఉంటున్నారు, ఏమి చేస్తున్నారు,  అవీ ఇవీ మాట్లాడుకున్నాం.  

మొత్తానికి  వచ్చే శనివారం కలవబోతున్నాను.  ఆయనకు కాఫీ తాగే అలవాటు ఉంటే స్టార్ బక్స్ కు వెళ్ళాలి.  అదీ సంగతి.  ముందే చెప్పేసాను – నాకు ఈ సాహిత్యం,  పుస్తకాలూ  చదవడం అంతగా అలవాటు లేదు,  మీరు నన్ను కలసిన తరువాత టైం వేస్ట్ గాడు అనుకోకూడదు అని.  సో, నో ప్రాబ్లెమ్స్.    

3 thoughts on “శరత్ గారిని కలవబోతున్నానోచ్ …

Add yours

  1. ఈ టపా ఆలస్యంగా ఇప్పుడే చూసాను. మీ బ్లాగ్ మాలికలో రావడం లేదా? వస్తే ఎలా మిస్సయ్యాను చెప్మా. ఇప్పుడే హారం టాప్ 10 లిస్టులో ఈ టపా చూసి ఆశ్చర్యపడ్డాను మరియు సంతోషపడ్డాను. మీకు రేపు అడ్రసుతో సహా మెయిల్ ఇస్తాను.

  2. నాకు తెలిసి ఈ టపాకిప్పటికే కామెంట్లు వెల్లువెత్తాలె. ఏంటి చెప్పా ఇంకా ఎవరూ చేయి చేసుకోలేదు.

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑