ప్రతి సంవత్సరం చికాగో లో ఎయిర్ షో జరుగుతుంది అట. గత సంవత్సరం నేను వచ్చేటప్పటికే అయిపోయింది. ఈ సంవత్సరం ఆగస్ట్ పద్నాలుగు, పదిహేను రోజులలో జరిగింది. అసలిప్పటివరకూ ఇటువంటివి చూడలేదు. మనకు నేవీ డే అని వైజాగ్ లో డిసెంబర్ లో జరుగుతుంది. కాని ఎప్పుడూ వెళ్ళలేదు. మన ఎయిర్ షో లు బెంగళూరు, హైదరాబాద్ లో అయినట్లు గుర్తు. కాని చూడలేదు. అప్పుడు ఎల్.సి.ఏ, ధ్రువ్ హెలికాప్టర్ లూ చాలా బావున్నాయి అట.
ఆదివారం వెళ్దాం అనుకున్నాం. నాకు మాత్రం మహా ఎక్సైటింగ్ గా ఉంది. మిచిగాన్ లేక్ పైన … నీలి నీలి ఆకాశం లో … అంతెత్తున చేసే విన్యాసాలు ఎలా ఉంటాయి అని, అదీ కాక ఇది అమెరికా నేవీ, ఎయిర్ ఫోర్సు ఈవెంట్స్. నాకు అంత నాలెడ్జ్ లేదు కాని … అమెరికా సూపర్ పవర్ కదా … ఎఫ్.16 లు, ఎఫ్ 18 లు, B1 బాంబర్ లు, ఇంకా ఎన్నో, ఎన్నెన్నో … అవి అన్నీ ఎలా ఉంటాయో చూడాలి అని … నిన్న ఎలా ఉందొ నాకు తెలియదు కాని, ఇవాళ బావుంది కాని, మరీ అంత బాలేదు. పదకొండు కల్లా డౌన్ టౌన్ చేరుకున్నాం. వాతావరణం బావుంది , మరీ అంత ఎండగా లేకుండా, మబ్బులు లేకుండా నీలం గా ఉంది.
కంబర్ ల్యాండ్ స్టేషన్ లో కారు పార్క్ చేసి లోకల్ ట్రైన్ లో డౌన్ టౌన్ చేరుకున్నాం. అప్పడు తీసిన ఫోటో. ఎప్పుడూ హై వే ఫోటో తీయలేదు. చిన్నప్పుడు ఎప్పుడో అమెరికా అల్లుడో, ఇంకేదో సుమన్ సినిమా టైటిల్స్ వచ్చేటపుడు చూపెడతాడు. ఇంత కాలానికి నేను ఫోటో తీయగలిగాను.
స్టేషన్ లో దిగి, కారు మాట్లాడుకుని లేక్ షోర్ దగ్గర దిగాం. అప్పటికే మొదయిపోయింది. ఎక్కడ చూసినా జనం, పోలీసులు. మామూలే. వేసవి కదా, బట్టలు విప్పేసి
స్నానాలు చేసేస్తూ ఉంటారు. ఎండ మరీ అంత ఎక్కువగా లేదు కాని ఎక్కువగానే ఉంది. చిన్న, చిన్న విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి. బానే ఉంది అనిపించింది. పొగలు వదులుతూ, రక రకాల షేపు లలో .
వీటిని ఏమి అంటారో నాకు తెలియదు.
ఇవి అయిపోయిన తరువాత మూడు హెలి కాప్టర్లు వచ్చాయి – సొగసు గా ఎగురుకుంటూ.
ఏవేవో చేసేస్తాయి అనుకున్నాను. కాని ఏమి జరిగిందంటే మూడు ప్రక్క, ప్రక్క నీటికి కొంచం ఎత్తులో నిల్చున్నాయి కొంతసేపు.
అంతకు మించి ఏమి చేసాయో నా బుర్రకు అర్థం కాలేదు. కాని బావున్నాయి, నల్లగా, మూడు ప్రక్క ప్రక్క నే నిల్చుని. కొంత సేపు అయిన తరువాత ఆరెంజ్ కలర్ లో ఒక రెస్క్యు హెలికాప్టర్ వచ్చింది. ఒకడు నీటిలో దూకాడు, వీళ్ళు వాడిని తాడు వేసి పైకి లాగాడు, వాడు చేతులు ఊపుకుంటూ లోపలి వెళ్ళిపోయాడు. ఇంకొంచం సేపు అయిన తరువాత అదేదో ట్రాన్స్ పోర్ట్ విమానం లా ఉంది. నెమ్మదిగా ఎగురుకుంటూ వచ్చింది. ఇదీ అంత నచ్చలా.
ఒకానొక దశ లో వెళ్లి పోదాం అనిపించింది. అంతా బోర్ గా ఫీల్ అయ్యాం. కాని మమ్మల్ని ఉండేలా చేసింది ఒకే ఒక కారణం. అదే ఎఫ్ 16 /ఎఫ్ 18 విన్యాసాలు. అంతా ప్రశాంతంగా ఉన్న వేళ, ఒకే సారి పైనుండి, ఆకాశం బద్దలయేలా, గుండెలు దడ దడ లాడేలా, విపరీతమయిన వేగం తో పల్టీ కొడుతూ, గిర గిరా తిరుగుతూ, నింగికి కన్నం పెడుతున్నాయా అన్నట్లు ఎగురుతూ, ఎగిరాయి. ఎందుకో వాటిని చూస్తూ ఉన్నంత సేపు రోమాలు నిక్కపోడుచుకున్నాయి. భలే గా అనిపించింది.
అప్పుడు అనిపించింది. పోయేలోగా ఒక్కసారి అయినా ఫైటర్ జెట్ ను నడపాలి. అదీ MIG లు, మామూలు విమానాలు కాదు. వీలు అయితే F16 లు, లేక పొతే Sukhoi లు. మనకి అంత సీన్ లేదు కాని, ఒక దారి ఉంది. ఉక్రెయిన్ లోనో, లేక ఇంకేదో సోవియట్ కంట్రీ లోనో గంటకు ఇంత అని చెప్పి ఇచ్చి, నడపొచ్చు.
ముందు డబ్బులు సంపాదించాలి.
మొత్తం మీద ఇది మరీ అంత కాదు కాని, కొంత బావుంది. సూపర్ పవర్ రేంజ్ లో
మాత్రం లేదు. ఈ విన్యాసాలు చేయడానికి యెంత కష్టం పడతారో నాకు తెలియదు. ప్రాణాలతో ఆట కదా. కాబట్టి కనిపించేది చూడటం తప్ప, కామెంట్లు చేయడం తప్పేమో.
ఇన్ని ఫోటో లు తీసినా, ఫైటర్ జెట్ లవి మాత్రం కుదరలేదు. నా కెమెరా అందుకు సరిపోదు. ఇంకొక విషయం ఏమిటి అంటే ఒకోసారి నాలుగైదు విమానాలు ఒక టీం గా చేస్తుంటాయి. బహుశా దీనికి బోలెడంత ప్రాక్టీస్, మంచి అండర్ స్టాండింగ్ కావాలి.
గాలిలో ఎగిరే విమానాలు బాలేకపోయినా, నీటి లో స్నానం చేస్తున్న సీతాకోక చిలుకలు బావున్నాయి కదా. కాబట్టి, నో మోర్ కంప్లైంట్స్ . . . అదీ సంగతి.







నేను చూసిన ఎయిర్ షొ లొ కూడా బోర్ కొట్టి వెళిపొదామనుకున్న టైం కొ ఎఫ్ 16 ని 18 ని వచ్చాయి… అప్పుడు నేను ఇలాగే అనుకున్నా…
” ఎప్పటికయినా ఒక్కసారి ఇలాంటి ఫైటర్ జెట్ ను నడపాలి అని ” :-))
ఆగి వున్నప్పుడు ఎఫ్ 16 ఎక్కి చూసా కానీ నడపడం ఎప్పటికి కుదురుతుందో :-))