నా కారు ఏమి కొత్తది కాదు, అంత ఖరీదు అయినది కాదు – కాని, అది నాది. తనది అయిన దేనిమీద అయినా ఎవరికయినా ఎంతో కొంత ఇది ఉంటుంది అనుకుంటాను. అదీ కాక, ఇది బావ ఇచ్చినది. మామూలు గా నాకు కోపం రాదు. వీళ్ళను ఆఫీసుకు తీసుకు వెళ్తాను కదా, అందరం కలిసే వెళ్తాం. కూర్చున్న తరువాత డోర్ నెమ్మదిగా వేయొచ్చు కదా. దానిని బద్దలు కొట్టాలి అన్నంత గట్టిగా వేస్తారు. లేక పొతే ఇది నాది అన్న ఫీలింగ్ వల్ల నేనే మరీ అంతగా ఆలోచిస్తున్నానా ??? అప్పుడు నాకు అనిపిస్తుంది, “చెత్త నా కొడుకుల్లారా, డోర్ వేస్తే చాలు, పగలగొట్టనవసరం లేదు” అని. కాని ఏమి అనలేను. అందుకే నా ఆక్రోశాన్ని ఇలా రాసుకుంటున్నాను.
మీరు బాధపడుతున్నారన్న విషయాన్ని వాళ్లకి తెలిసేలా చేయాలి. అంత్య నిష్టూరం కన్న ఆదినిష్టూరమే మేలు. ఒకవేళ వాళ్లు అప్పటికీ వినకపోతే కారులో వారిని తప్పించడానికి ఎదో ఒక మార్గం ఉండకపోదు. ముందరే తెలియ జేయడం వల్ల మీలో కలిగే బాధ ద్వేషంగా మారకుండా ముందరే జాగ్రత్తపడచ్చు.
all the best.. 🙂
బాగా చెప్పారు
Same feeling