ఆఫీసు లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పెట్టారు. మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తుంటే సరే అని చెప్పి నేను వెళ్ళాను. ఇంతకు ముందు ఒక సారి ఇచ్చాను గాని ఇప్పుడు భయం వేసింది. ఏం కాదు, ఏం కాదు, వెళ్ళు వెళ్ళు అని చెప్పుకుంటూ లోపలకు వెళ్ళాను. ఒక ఫాం ఇచ్చి కొన్ని ప్రశ్నలు వేసింది – గత సంవత్సర కాలం లో ఇండియా కు వెళ్ళావా అంది ? ఎందుకో అర్థం కాలేదు. లేదు అని చెప్పాను. ఫాం లో చాలా ప్రశ్నలు ఉన్నాయి – నువ్వు UK వెళ్ళావా , mexico వెళ్ళావా, ఆ రోగం ఉందా, ఇది ఉందా అని. అంతా పూర్తి చేసిన తరువాత నువ్వు ఇక్కడకు వచ్చి యెంత కాలం అయింది అంది. మూడు సంవత్సరాల నుండి ఇక్కడ లేకపోతే డొనేట్ చేయడానికి పనికి రావు అంది. అన్నిటి కన్నా ముందు అడగాల్సిన ప్రశ్న ఇదే కదా అనుకుంటూ బయటకు వచ్చేసా !!! అప్పుడు చెప్పింది, ఇండియా లో మలేరియా ఎక్కువ కదా, మా కొలీగ్స్ అందరికి వచ్చేసింది, అందుకే అడిగాను అని.
ఇదీ మా ఆఫీసు ఫోటో.
వస్తూ ఉంటే సీతాకోక చిలుక లు వాలీబాల్ ఆడుతూ కనిపించాయి. అరే భలే ఆడుతున్నారే అని కొంతసేపు చూసాను. నాకు వీళ్ళను చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. మన లంచ్ టైములో పరుగెడుతూ , జిమ్ కు వెళ్లి ఎక్సర్సైజ్ లు చేస్తూ, బాస్కెట్ బాల్, వాలీ బాల్ ఆడుతూ శరీరాన్ని తీగ లాగ ఉంచుతారు. తప్పు అని తెలిసినా కళ్ళు అప్పగించకుండా ఉండడం కష్టమే. మా హేలు చెప్పేవాడు.


tappu ee sariki sare kaani inka maLLi ala chuDaddu…. ok naa