పూణే నుండి హైదరాబాద్ వస్తున్నపుడు బస్సు లో 'ఆవకాయ్ బిర్యాని' మూవీ వేసాడు. పూర్తిగా చూడలేదు గాని బాలేదు అనిపించింది. ఇలా బస్సు లో వస్తున్నపుడు మంచి సినిమాలు వెయ్యకపోతే నాకు చిర్రెత్తుకొస్తుంది. అదేంటో నాకు డబ్బులు పెట్టి హాలులో చూసిన సినిమా కన్నా, ఇంటికి వెళ్తున్నపుడు బస్సు లో వేసిన సినిమా చూస్తుంటే భలే గా ఉంటుంది. అది అప్పటివరకూ నేను చూడని సినిమా అయి ఉండి, మంచి సినిమా అయితే మరీను... చిన్నప్పుడు వినాయక చవితికి, దసరాకు, ... Continue Reading →
ఓ, సచిన్ ఇక్కడకు వెళ్లేవాడా !!
ఇంతకు ముందు పేపర్లో చాలా సార్లు చదివాను. సచిన్ ఫ్యామిలీ తో కలసి లోనావ్లా వెళ్ళాడు అని. అది పూణే కు దగ్గర అని తెలుసు కాని, మరీ ఇంత దగ్గర అని తెలియదు, అంటే జస్ట్ నలబై కిలోమీటర్ లు మాత్రమే. ఆఫీస్ పని మీద రెండు వారాలు పూణే లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు వెళ్ళాను ఇక్కడకు. చాలా మంది చెప్పారు చాలా బావుంటుంది అని. వెళ్ళిన తరువాతే తెలిసింది ఇంత బావుంటుంది అని. బైక్... Continue Reading →
మిమ్మల్ని ముద్దు పెట్టుకోవచ్చా ???
అవి నేను అమెరికాలో ఉన్న రోజులు. ఒక హోటల్ లో ఉండేవాడిని. అదేంటో అక్కడ ఎక్కడ చూసినా మెక్సికన్ లే కనిపిస్తూ ఉంటారు - ఫ్రెష్ ఫార్మ్స్ లో చూసినా, మా హోటల్ లో రూమ్స్ క్లీన్ చేసే వారిని చూసినా, మెకానిక్ షెడ్ కు వెళ్ళినా. తరువాత తెలిసింది, మెక్సికో అమెరికా ప్రక్కనే కాబట్టి, వీళ్ళు అంతా ఇక్కడకు వలస వచ్చేస్తూ ఉంటారని. మా హోటల్ లో రూంని వారానికి ఒక్కరోజు క్లీన్ చేస్తారు. ఒక... Continue Reading →
భూపతి పాలెం కథలు …
ఒక రోజు మా బావ ఉదయాన్నే కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. అపుడు నేను ఏంటి రా అని చెప్పి తన ఆలోచనలను దొంగిలించాను. వాటిని చూస్తే అపుడు తెలిసింది తను చదువుకున్న రోజుల గురించి ఆలోచిస్తున్నాడు అని. అవి ఇలా ఉన్నాయి ... అవి నేను భూపతిపాలెంలో చదువుతున్న రోజులు. అక్కడ ఎ.పీ గురుకుల స్కూల్ ఉంది. దీని గురించి కొంత - రాజు గారు అని ఉండేవారు. రెండవ ప్రపంచ యుద్ద సమయం లో నేతాజీ సుబాష్ చంద్ర... Continue Reading →
బోలో … గణేష్ మహారాజ్ కీ జై …
అపుడపుడు అనిపిస్తుంది ఏ పండగకు లేని శక్తి వినాయక చవితి కి ఉంది అనిపిస్తుంది. ఆ తొమ్మిది రోజులు ఎలా ఉన్నా, నిమజ్జనం రోజు మాత్రం చాలా బావుంటుంది. అసలు ఆ డప్పులు, ఆ డాన్సులు చూస్తుంటే సూపర్ గా ఉంటుంది. నాకు ఎప్పటి నుండో ఒక కోరిక మిగిలిపోయింది - వాళ్ళు కొట్టినట్లు డప్పు కొట్టాలి, డాన్సు వెయ్యాలి. మొన్న చాన్స్ వచ్చింది కాని సిగ్గేసింది. ఎవరో చూస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంటే ఏమి చేయలేం.... Continue Reading →
నా FZ16 …
మొన్ననే బైక్ కొన్నాను. ఇప్పటి వరకూ ఆటోలు, బస్సుల మీదనే గడిపేసాను. మా బావ చెప్పాడు - నీకు వాహన యోగం ఉంది అని చెప్పి. వాహనం యెంత విలువయినదో కూడా చెప్పాడు. శివుడికి నంది, వినాయకుడికి మూషికం ఇలా ప్రతి దేవుడుకి వాహనం ఉంది. నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ హెల్త్ యెంత విలువయినదో, బండి హెల్త్ కూడా అంతే విలువ అని ఇంకా ఏవేవో చెప్పాడు. నాకు పల్సర్ అంటే చాలా ఇష్టం. కాని... Continue Reading →