నా FZ16 …

మొన్ననే బైక్ కొన్నాను.  ఇప్పటి వరకూ ఆటోలు, బస్సుల మీదనే గడిపేసాను.  మా బావ చెప్పాడు – నీకు వాహన యోగం ఉంది అని చెప్పి.  వాహనం యెంత విలువయినదో కూడా చెప్పాడు. శివుడికి నంది, వినాయకుడికి మూషికం ఇలా ప్రతి దేవుడుకి వాహనం ఉంది. నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.  నీ హెల్త్ యెంత విలువయినదో,  బండి హెల్త్ కూడా అంతే విలువ అని ఇంకా ఏవేవో చెప్పాడు.

నాకు పల్సర్ అంటే చాలా  ఇష్టం. కాని ఈ మధ్య వస్తున్న మోడల్స్ నచ్చడం లేదు. ఇంకా కరిజ్మా, సి.బి.జి, యునికార్న్ ఏది బావుంటుందో అని ఆలోచించాను. రివ్యూ లు చదివాను.  కాని యమహ FZ16 మీదకు మనసు లాగేసింది. చూడడానికి గేదె లా ఉన్నా, మైలేజ్ ముప్పై అయిదు, నలబై ఇచ్చినా  బానే ఉంది అనిపించింది.  వెంటనే కొనేసాను.

ఇప్పుడు బానే ఎంజాయ్ చేస్తున్నాను.

ముందయితే ఫేజర్ అనుకున్నాను. కాని తెలిసింది FZ16 , ఫేజర్, FZ -S  ఇవి అన్నీ బేసిక్ గా ఒకే మోడల్. చిన్న, చిన్న తేడాలు తప్ప అని.  ఎందుకో ఈ మధ్య రెడ్ కలర్ మీదకు మనసు లాగేస్తుంది. ఆంజనేయ స్వామి గుడి లో పూజ చేయించాను. అదేంటో అదో ఫీలింగ్. పూజ చేయించేసాం,  ఇంక మనకు ఏమీ కాదు అనిపిస్తుంది.

3 thoughts on “నా FZ16 …

Add yours

  1. గేదేలా ఉన్నా ఎర్రగా ముద్దుగా బొద్దుగా చక బాగుంది…

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑