ఇంతకు ముందు పేపర్లో చాలా సార్లు చదివాను. సచిన్ ఫ్యామిలీ తో కలసి లోనావ్లా వెళ్ళాడు అని. అది పూణే కు దగ్గర అని తెలుసు కాని, మరీ ఇంత దగ్గర అని తెలియదు, అంటే జస్ట్ నలబై కిలోమీటర్ లు మాత్రమే. ఆఫీస్ పని మీద రెండు వారాలు పూణే లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు వెళ్ళాను ఇక్కడకు. చాలా మంది చెప్పారు చాలా బావుంటుంది అని. వెళ్ళిన తరువాతే తెలిసింది ఇంత బావుంటుంది అని.
బైక్ మీద వెళ్ళాం. అప్పుడు తీసాను ఈ ఫోటోలు.
ఈ ప్లేసు ను “Lion ‘s point ” అంటారట. ఇక్కడ నుండి చూస్తే అల్లంత దూరాన అంతా ఆకాశమే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడకు రావడానికి మంచి టైం జూలై, ఆగస్ట్ అట. ఎందుకంటే వర్షం లో అద్బుతం గా ఉంటుందట. కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఊహించుకున్నాను – ఆకాశం నుండి అంత నీరు ఆ లోయలలోకి కురుస్తుంటే …. వచ్చే సంవత్సరం వెళ్ళాలి ….
beautiful photos of a beautiful place 🙂