పూణే నుండి హైదరాబాద్ వస్తున్నపుడు బస్సు లో ‘ఆవకాయ్ బిర్యాని’ మూవీ వేసాడు. పూర్తిగా చూడలేదు గాని బాలేదు అనిపించింది. ఇలా బస్సు లో వస్తున్నపుడు మంచి సినిమాలు వెయ్యకపోతే నాకు చిర్రెత్తుకొస్తుంది. అదేంటో నాకు డబ్బులు పెట్టి హాలులో చూసిన సినిమా కన్నా, ఇంటికి వెళ్తున్నపుడు బస్సు లో వేసిన సినిమా చూస్తుంటే భలే గా ఉంటుంది. అది అప్పటివరకూ నేను చూడని సినిమా అయి ఉండి, మంచి సినిమా అయితే మరీను…
చిన్నప్పుడు వినాయక చవితికి, దసరాకు, సంక్రాంతికి చాలా బాగుండేది. రోడ్డు మీద తెర కట్టి, ప్రొజెక్టర్ తో మంచి, మంచి సినిమా లు వేసేవారు మా ఊరిలో. రాత్రి ఎనిమిది అయ్యేటప్పటికి మాంచి సందడిగా ఉండేది. గోనె సంచులు పట్టుకుని పరుగెత్తేవాళ్ళం. తెర కు రెండు వైపులా జనమే. ఏమేమి చూసానో గుర్తు లేదు కాని, ‘రాజ కోట రహస్యం’, ‘వేటగాడు’ చూసినట్లు గుర్తు. మళ్లీ ఆ రోజులు ఎప్పుడు వస్తాయో అనిపిస్తుంది.
మా ఊరిలో సినిమా హాలు లేదు. ప్రక్కనే ఉన్న రామచంద్రపురం గాని, మాచవరం గాని వెళ్ళాలి. అపుడు చూసిన సినిమా నే ‘కొదమ సింహం’. మా ఊరి నుండి మాచవరం ఒక నాలుగు కిలోమీటర్ లు ఉంటుందేమో. కాలువ గట్టు మీద నుండి అలా నడుచుకుంటూ మా చిన్నాన్న, నేను, మా కజిన్స్ అందరం కలసి ఉదయం పన్నెండు కల్లా హాలు దగ్గరకు చేరుకున్నాం. అప్పుడు చావు కబురు చల్లగా తెలిసింది. మార్నింగ్ షో లేదు అని. మళ్లీ ఆ గట్టు వెంబడే ఇంటికి వచ్చి అన్నం తిని మళ్లీ బయలుదేరాం. ఇసుక లో కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. అయితేనేం, సినిమా బావుంది.


క్షమించు మిత్రమా, మండపేట గురించి చెప్పడం మరచాను. ఆ “సప్తగిరి” లో దర్శించుకున్న సినిమాలు ఎన్నో, ఎన్నెన్నో … అలానే కృష్ణా, సూర్యలు కూడా …. కాని చిన్నప్పుడు మా రేంజ్ మాచవరం, రామచంద్రపురాలే !!!
ఏమో మరి, నాకైతే బస్సు ప్రయాణంలో ఎంత చెత్త సినిమా ఐతే అంత బెటరనిపిస్తుంది. 🙂
Good post.
ఏంటీ సినిమాలు చూడ్డానికి రామచంద్రపురం వెళతావా ? మండపేటలో చూడవా ? మన వూళ్ళొనే మూడు థియేటర్లున్నాయ్( ప్రస్తుతం మూసేసారనుకో) మరి వాటిలో ఏం చూసావ్ . అది సరె నీ ప్రొఫైల్ కనిపించడం లేదేంటీ ?