నేను టెన్త్ చదివి పన్నెండు సంవత్సరాలు అయిపోతుంది. మా క్లాసు లో డెబ్బయి, ఎనబై మంది ఉండేవాళ్ళం. అందులో ఒక యాబై మంది అబ్బాయిలే. చాలా మందిని చూసి ఇంత కాలం అయిపోతుంది. దాదాపు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు కూడా. ఇంత కాలానికి అందరం మళ్లీ కలుసుకున్నాం. రోజంతా మాటల తోనే సరిపోయింది. మా వాళ్ళందరూ మా ఊరి లోనే ఉంటారు. రోజూ చూసుకుంటూనే ఉంటారు. వాళ్లకు ఇలా కలుసుకోవడం అంత గొప్పగా అనిపించకపోవచ్చు. ... Continue Reading →
నా లైఫ్ లో పౌర్ణమి ఎప్పుడు వస్తుంది బాబోయ్ ???
ఇంకో ఆరు నెలల్లో ఇరవై తొమ్మిది లోకి అడుగు పెడతాను, ఆ తరువాత ఇంకో సంవత్సరం పొతే ముప్పై లోకి జంప్ చేస్తాను. ఇప్పటికీ పెళ్లి కాలేదు. అయ్యో !!! అమ్మ, నాన్నలతో సహా అందరూ నాకు శత్రువులలా కనిపిస్తున్నారు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే. నాన్నకు తూర్పు వైపు సంబంధాలు ఇష్టం ఉండవట (తూర్పు అంటే శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం). అమ్మ ఏమో అమ్మాయిని చూసే భాద్యత అత్తా వాళ్లకు ఇచ్చేసింది, నా గురించి పట్టించుకోవడం మానేసింది. ... Continue Reading →