ఇంకో ఆరు నెలల్లో ఇరవై తొమ్మిది లోకి అడుగు పెడతాను, ఆ తరువాత ఇంకో సంవత్సరం పొతే ముప్పై లోకి జంప్ చేస్తాను. ఇప్పటికీ పెళ్లి కాలేదు. అయ్యో !!! అమ్మ, నాన్నలతో సహా అందరూ నాకు శత్రువులలా కనిపిస్తున్నారు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే. నాన్నకు తూర్పు వైపు సంబంధాలు ఇష్టం ఉండవట (తూర్పు అంటే శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం). అమ్మ ఏమో అమ్మాయిని చూసే భాద్యత అత్తా వాళ్లకు ఇచ్చేసింది, నా గురించి పట్టించుకోవడం మానేసింది. బావ ఏమో నీ పెళ్లి జూన్ లో కాకపొతే, గ్రహాలను బాగా అబ్జర్వ్ చేసి ఇంకెప్పుడు అవుతుందో చెబుతాను అంటున్నాడు. హేమ ఏమో కాకినాడ లో మంచి సంబంధం ఉంది అంటుంది గాని, ఆ అమ్మాయి ఫోటో మాత్రం పంపించడం లేదు. పద్మ పిన్ని, లలితక్క వాళ్లకు మా అత్తా వాళ్ళు చూసే సంబంధం ఇష్టం ఉండదు. వాళ్ళు వైజాగ్ లో సత్యం పని చేసే అమ్మాయిని చూసారంట. మరి ఫోటో పంపించొచ్చు కదా, మర్చిపోయారు.
ఇలా ప్రతి ఒక్కరు నా జీవితం తో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. చందమామ ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు మాట్లాడుతాను, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఆ పెళ్లి సంబంధాలు చూసే ఆయన ఏమో నాలుగు సంబంధాలు ఉన్నాయి అని నాలుగూ వారాలు గా చెప్తున్నాడు. మరి ఫోటోస్ పంపించొచ్చు కదా ???
నా చందమామ ను పట్టుకోవడానికి ముందు యెంత మందికి చూడాలో ? నన్ను ఎంతమంది తన్నుతారో ??? నేను యెంత మందిని తన్నుతానో ? ఆకాశం వైపు చూడడం తప్ప ఏమి చేయలేను !!! వీళ్ళందరూ చంద్రుడిని మింగేస్తున్న రాహువులా, కేతువులా కనిపిస్తున్నారు నాకు !!!
అసలే దేశం లో అమ్మాయిలు తగ్గిపోతున్నారట. పోటీ ఎక్కువ ఉంటుంది. మరి నేను కండిషన్స్ ఏమన్నా పెట్టానా ??? కట్నం ఏమన్నా అడిగానా ?? పెద్ద చదువులు కావాలి అన్నానా ?? కొంచం పొడుగ్గా, కొంచం అందంగా ఉండాలి అన్నాను. అంతే కదా !!! వీళ్ళందరికీ అమ్మాయి నచ్చాలి, అమ్మాయి అమ్మ, బాబులు నచ్చాలి, వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ నచ్చాలి, ఇంకా కట్నాలు, కేస్ట్ లు నచ్చాలి. అన్నింటి కన్నా క్లిష్టమయినది పెళ్లి అనిపిస్తుంది దేవుడా …
దేవుడా! మంచి దేవుడా!
సంపాదించడానికి మంచి వుద్యోగం ఇచ్చావ్!
సలహాలకి మంచి బావ ని ఇచ్చావ్!
వుద్యోగం చేసుకునేదానికి మంచి తెలివితేటలూ ఇచ్చావ్!
కానీ ఎందుకు దేవుడా! ఇతనికి ఇష్టమైన అమ్మాయిని (చందమామని) ఇవ్వకుండా చేసావ్??
నువ్వు ఇతని కలలు నేరవేరుస్తావ్!
నాకు తెలుసు…..
ఎందుకంటే….బేసికల్లి…..యు ఆర్ గాడ్! వెరీ గుడ్ గాడ్!
అంతే!
ఇట్లు
ఫణి రమేష్ చింతలపాటి.
చాలా బాధల్లో ఉన్నట్టున్నారు 🙂
రవి గారు..మీరు చందమామ కావాలంటున్నారు…మళ్ళి చందమామే మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు…అమ్మలు చిన్నప్పుడు అన్నం తినిపించేటప్పుడు చందమామ ని మాత్రమే చూపిస్తారు గాని దగ్గరకు తీస్కురారు కదా(నేను చెప్పింది నాకే కొంచం క్లియర్ గా లేదు మీకు ఉంటుందని ఆశిస్తున్న)….సో అమ్మలు అక్కలు చందమామ వెతుకుతారు తీసుకొస్తారు అని మీరు ఆశించడం మానేసి మీరే చందమామ కోసం బయలేదేరండి…మద్యలో స్నేహితులు మీ చుట్టూ పక్కల ఉన్నవారు కూడా చందమామ ల కనపడతారు…చివరికి మీరు ఒక నక్షత్రాన్ని తీసుకొచ్చి తనే నా చందమామ అంటే మీ అమ్మ నాన్నలకు చుట్టాలకు అది మీ చందమామే అని ఒప్పుకోక తప్పదు కదా…
swapna…cant bear your ATI in blogs. pl stop.
పెళ్లి చేసుకోవాల్సింది ,కాపురం చెయ్య వలసినది మీరు .మీకు నచ్చే అమ్మయిని మీరే వెతుక్కోవాలి అందరికి నచ్చే అమ్మాయి దొరకాలంటే ,అలా ఏళ్ళు గడిచిపోతూనే వుంటాయి .అందరిని మీ జీవితం తో ఆడుకునే ఆవకాశం కల్పించకండి కట్నం గిట్నం ఆశించకుండా ఓ పేదింటి చందమామని పెళ్ళిచేసుకొండి
mikentayya maga maharaajulu inthe kavali ani cheppi malli oka pedda list cheppestaru kada requirements :p
mi abbayilaki ammayi muttukunte kandipoyentha thelupu antaru, andam chandam antaru, chaduvu, job antaru, asthi antaru, height antaru. inka katnam antaru lakshalu lakshalu hmmm…
mari ammayilu papam amaayikulu chaduvu, manchiga unte chalu anukune amaayikulu 😦
మీ ఫోటో, వివరాలు వెబ్లో పెడితే ఎవరైనా సంబధాలు చూస్తారు. గుంటూర్ అమ్మాయిలను చేసుకోండి, ఆవకాయ, పచ్చళ్ళు బాగా పెడతారు.