నేను టెన్త్ చదివి పన్నెండు సంవత్సరాలు అయిపోతుంది. మా క్లాసు లో డెబ్బయి, ఎనబై మంది ఉండేవాళ్ళం. అందులో ఒక యాబై మంది అబ్బాయిలే. చాలా మందిని చూసి ఇంత కాలం అయిపోతుంది. దాదాపు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు కూడా.
ఇంత కాలానికి అందరం మళ్లీ కలుసుకున్నాం. రోజంతా మాటల తోనే సరిపోయింది. మా వాళ్ళందరూ మా ఊరి లోనే ఉంటారు. రోజూ చూసుకుంటూనే ఉంటారు. వాళ్లకు ఇలా కలుసుకోవడం అంత గొప్పగా అనిపించకపోవచ్చు. కాని నాకు మాత్రం భలే మజా ను ఇచ్చింది.


Leave a comment