యెర్ర బస్సు …

యెర్రని దుమ్మును రేపుకుంటూ ఆ ఊరికి ఉన్న ఒకే ఒక్క బస్సు ఆగింది … ఆందోళనకారులు నాలుగు బస్సులను దహనం చేసారు … రేపటి నుండి ఆటో యూనియన్ల ఆందోళన – ఎక్కువ సర్వీసులను నడపాలని ఆర్.టీ.సి నిర్ణయించింది … ఏంట్రా యెర్ర బస్సు ఎక్కి వచ్చేసావా ??? … నాకు తెలిసి ఇలా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఆర్.టీ.సి కి ఉన్న స్థానం చిన్నది కాదు అని నా అభిప్రాయం …
ఈ మధ్య తణుకు నుండి రావులపాలెం వెళ్ళేటప్పుడు ఆర్.టీ.సి బస్సు ఎక్కాం బావ, నేను … ‘జల్’ తుఫాను వల్ల విపరీతం గా వర్షం కురుస్తుంది … బస్సు లోపలకు, అద్దాలను దాటి చినుకులు పడుతున్నాయి. సీట్ల నిండా నీరే … బావ ఆర్.టీ.సి ను తిట్టాడు … నాన్న గత పాతిక సంవత్సరాలుగా ఆర్.టీ.సి లో పని చేస్తుండడం వలనో, ఆ కారణం చేత చిన్నప్పటి నుండి ఎక్కువగా బస్సులలో తిరగడం వల్ల అయితేనేమి ఆర్.టీ.సి బస్సులంటే నాకు ఎందుకో అదో ఇష్టం … బావ అలా అనడం తో నాకు బాధగా అనిపించింది …
ఏ.పీ.ఎస్.ఆర్.టీ.సి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. మిగతా స్టేట్స్ లో బస్సులు ఎలా ఉంటాయో తెలియదు కాని, మన బస్సులు బావుంటాయి, మంచి కండిషన్ లో ఉంటాయి అని నా అభిప్రాయం. దాదాపు ఇరవై వేల బస్సులతో గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కింది. కాని, అదేంటో  ఎప్పుడు చూసినా బస్సుల లోంచి వేలాడుతూ ఉంటారు. అసలు ఎవరూ వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు ఆర్.టీ.సి ను ఇష్టపడతారని నేను అనుకోను. నిజమే, టీ.వి లు ఉండవు, ఉన్నా పని చేయవు. ప్రతి డిపో లోను ఆపుతాడు. పన్నెండు గంటల ప్రయాణం పదిహేను గంటలు పడుతుంది. సరే, దూర ప్రయాణాల సంగతి వదిలేద్దాం. ప్రైవేటు బస్సులు బావుంటాయి అని పోగిడేస్తాం గాని, వాళ్ళు నడుపుతుంది లాభాల కోసమే గాని సేవ చేయడానికి కాదు కదా. మన రాష్ట్రం లో ఇన్ని వేళ పల్లెలు ఉన్నాయి. దాదాపు ప్రతి చోటకు బస్సులు నడుపుతుంది ఆర్.టీ.సి నే కదా. జనంతో బస్సు నిండినా, నిండకపోయినా బస్సు నడుస్తుంది కదా.
నిజమే, ప్రైవేటు బస్సులతో పోటీ పడాలంటే ఇంకా బాగా పని చేయాలి. బస్సులను మంచి కండిషన్ లో ఉంచాలి, టైము కు గమ్యం చేర్చాలి, ఇలా ఎప్పుడు జరుగుతుంది ?? నేను కూడా మా ఇంటికి వెళ్ళాలంటే ప్రైవేటు బస్సులోనే వెళ్తాను …

One thought on “యెర్ర బస్సు …

Add yours

  1. కండిషన్ విషయానికొస్తే మన ఎ.పి.యస్.ఆర్.టి.సి . బస్సులకంటే మహారాష్ట్ర బస్సులు మంచి కండిషన్ లో ఉంటాయండి.

    ప్రయాణికుల సౌకర్యం , సురక్షితం ఈ విషయాల్లో అయితే ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు దొర్లినా మనం మన ఆర్.టి.సి. నే బెస్ట్ అని గర్వం గా చెప్పుకోవచ్చు ..
    మన బస్సుల్లో రకాలు కూడా ఎక్కువ మహారాష్ట్ర , కర్నాటక ల తో పోల్చుకుంటే .
    ఈ మధ్యనే ధరలు పెరిగినా మహారాష్ట్ర , కర్నాటక ల తో పోల్చుకుంటే ఇప్పటికీ తక్కువే .
    విద్యార్ధులకు ,పౌరులకు ఇచ్చే రాయతీలు మిగతా రాష్ట్రాలకంటే ది బెస్ట్ .

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑