వెన్నెల్లో ఆడపిల్లా …

ఇప్పటివరకూ యండమూరి వీరేంద్రనాథ్  రాసిన వెన్నెల్లో ఆడపిల్ల గురించి వినడమే గాని,  స్టోరి తెలియదు.  అప్పుడెప్పుడో వచ్చిన శ్రీకాంత్ ‘హలో … ఐ లవ్ యు ‘  ఈ నవల ఆధారం గా వచ్చిన సినిమా అని తెలిసినా, చూడలేదు.  సాయి కిషోర్  చెప్పాడు … హీరో చెస్ ప్లేయర్ అని,  ఒక పోటీ లో  కళ్ళకు గంటలు కట్టుకుని గెలుస్తాడని,  అందుకు హీరోయినే హెల్ప్ చేస్తుంది అని … నేను అదే క్లైమాక్స్ అనుకున్నాను … వాడు గెలుస్తాడు,  పెళ్లి చేసేసుకుంటారు … హ్యాపీ ఎండింగ్ అనుకున్నాను … కాని నవల కొని చదివిన తరువాత గుండె పట్టేసింది … అరరే అనిపించింది … చిన్నప్పటి నుండి నాకు ట్రాజెడీ సినిమా లు నచ్చవు … చదివేసిన చాలా సేపటి వరకూ ఏదో బాధ నన్ను వెంటాడుతూనే ఉంది … బహుశా ఈ నవల చదివిన ప్రతి ఒక్కరికీ ఇలానే అనిపిస్తుందేమో … చివరి వరకూ ఆమెను చూడడు,  చనిపోయిన తరువాత కూడా చూడడు … ఇలా ఎందుకు జరిగింది … హాయి గా  ఆమెకు క్యూర్ అయిపోయి పెళ్లి చేసేసుకుంటే యెంత బావుండును అనిపిస్తుంది … కాని,  అది అలా ఉండడం వలనే ఇప్పటివరకూ గుర్తు ఉందేమో … అసలు ఆమె గురించి చెప్పడం అద్భుతం … చదువుతుంటే కళ్ళ ముందే కదిలింది …

4 thoughts on “వెన్నెల్లో ఆడపిల్లా …

Add yours

  1. ఆ నవల మొత్తం ఒకేసారి చదివిన మీరు అలా అనుకుంటున్నారు. ఆ నవల వార పత్రిక లో సీరియల్ గా వస్తుంటే దాదాపు ముప్పై వారాలు, వారం వారం నాలుగు పేజీలు చదివి (సస్పెన్సు పాయింట్ దగ్గరే ఆపేవాడు యండమూరి)
    ఆ ఏడు రోజులు దాన్ని నాలుగైదు సార్లు చదివి, అలోచించి, చర్చించి, అనుభవించి , ఆనందించి , దుఃఖపడి , తేరుకొని, మళ్ళీ కొత్త సంచిక చదివి ఇలా ఎన్నో అనుభూతులు పంచుకున్న మాలాంటి వారికి ఎలా ఉండాలి. అప్పట్లో ఆ కధానాయిక , నాయకుడు ఇతర పాత్రలు మా కుటుంబ సభ్యులు . ఈతరం వాళ్లకి ఆ అదృష్టం లేదు.

  2. ఎప్పటికీ నా ఫేవెరెట్ నవల అండీ వెన్నెల్లో ఆడపిల్ల.
    మొదటిసారి చదివినప్పుడు కన్నీళ్ళాగలేదు.
    ఇంత చిన్న జీవితం లో ఎన్నని ఆస్వాదించగలం అంటుంది రమ్య ఆ నవల్లో.ఇన్నేళ్ళు గడిచినా అది నిజం అనిపిస్తుంది నాకు

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑