అందమయిన అమ్మాయిలు హయబుసల్లాంటి వారు … ఇంజెన్ కెపాసిటి ఎక్కువ, పవర్ ఎక్కువ, రిక్వైర్మెంట్స్ ఎక్కువ, కొనాలంటే డబ్బులు ఎక్కువ, పైగా మన రోడ్ల మీద నడవడం కష్టమే.
అమ్మాయికి కొంచం డబ్బులుండి, అందం ఉండి, కొంచం చదువుకొంటే హయబుస లా తయారవుతుంది … నాలాంటి సామాన్యుడికి దక్కించుకోవడం కష్టమే … మధ్యలో ఈ కేస్ట్ ఒకటి … ఏది తక్కువ, ఏది ఎక్కువ అన్న విషయం పక్కన పెడితే, తక్కువ అబ్బాయిని ఎక్కువ అమ్మాయి ఇష్టపడదు, ఎక్కువ అబ్బాయినీ ఇష్టపడదు … [ నిజమే, అందరు అమ్మాయిలు ఒకలా ఉండరు …. ], పైగా జీతం ఎక్కువ ఉండాలంట … ఇప్పుడు మరీ అంత ఎక్కువ కాకపోయినా, ముందు ముందు పెరుగుతుంది కదా …
ఇంతకీ విషయం ఏమిటీ అంటే ఒక మాట్రిమోనియల్ సైట్ లో ఒక చందమామ ను చూసాను … మెయిల్ కొట్టాను … ఒక మూడు రోజుల తరువాత డిక్లైన్ చేసింది … ఆ కళ్ళు మాత్రం అద్భుతం … నాకు దక్కలేదు కదా అందుకే ఈ ఏడుపు … నా మిత్రుడు ఒకడు వాళ్ళ ఆఫీసు లో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసాడు … చాలా మంచోడు … ఆ అమ్మాయి కేస్ట్ ను కారణం గా చూపించి కుదరదు అని చెప్పింది … కేవలం కేస్ట్ కారణంగా ఇలా చేయడం ఎందుకో బాలేదు కదా !!!

“ఒక మాట్రిమోనియల్ సైట్ లో ఒక చందమామ ను చూసాను … మెయిల్ కొట్టాను … ఒక మూడు రోజుల తరువాత డిక్లైన్ చేసింది”
దీన్ని బట్టి అర్ధమయింది కదా హయబుసాలు వాటి డ్రైవర్ లని అవే ఎంచుకుంటాయి అని. అయినా మన రోడ్ల మీద హయబుసాలు ఎందుకు బాస్? సింపుల్ గా మన బజాజ్ పల్సర్ బెస్ట్.
నీ బాధ అర్ధమయింది. కానీ పల్సరే బెస్ట్. అదంతేలే! పెళ్ళయితే అర్ధమవుతుంది