రవితేజం …

బేసిగ్గా నేనేమీ రవి తేజ ఫ్యాన్ కాదు,నాకు సినిమాల గురించి అంతేమీ తెలియదు ... కాని ఎందుకో రవితేజ గురించి రాయాలి అనిపించింది. తన గురించి అందరికీ తెలిసింది బహుశా 'సింధూరం' సినిమా తో అనుకుంటాను.   తరువాత  'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'ఇడియట్'  సూపర్ గా ఉంటాయి. 'నిన్నే పెళ్ళాడుతా' లో నాగార్జునతో డిస్కో లో కొట్టించుకున్న ఒక చిన్న క్యారక్టర్ లో ఉంటాడు. అటువంటిది ఇప్పుడు ఇంత పెద్ద హీరో కావడం బావుంది. అసలు మన సినిమాలో... Continue Reading →

సరిగా ఐదు సంవత్సరాల క్రితం …

నేను జాబు లో జాయిన్ అయి ఇవ్వాల్టికి సరిగ్గా ఐదు సంవత్సరాలు ... అయ్యబాబోయ్ ... ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదోలా అనిపిస్తుంది ... ఏ విషయంలో అయినా  'మొదటి' కి ప్రత్యేక స్థానం ఉంటుందనుకుంటాను ... మనం సాధించింది ఏమన్నా ఉందా అని ఆలోచిస్తే 'లేదు' అన్న సమాధానం వస్తుంది ... అయినా ఏమి చెయ్యాలి ? అంతకు వారం రోజుల ముందే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యాయి ... పండక్కి ఇంటికి... Continue Reading →

సంక్రాంతి … ఓకే … బానే ఉంది …

ఈ సంవత్సరం సంక్రాంతి ఏదో అలా, అలా గడచిపోయింది. ఇంటికెళ్ళి ఉంటే బావుండేది.  ఆ  భోగి మంటలు, బంతి పూలు,  లంగా వోణి అమ్మాయిలు,  పాపి కొండలు ట్రిప్  ... అన్నీ చూసి ఉండేవాడిని ... కాని మా టీం మేట్ పెళ్లి కేరళలో ఉంది. ఆఫీసుకి ఒకరోజు డుమ్మా కొట్టేసి నాలుగు రోజులు కేరళలో ఉందామని ప్లాన్.  చెత్తలాగా  నాతొ వచ్చేవాడు హ్యాండ్ ఇచ్చేసాడు. ఇక నేనూ వెళ్ళలేదు.  టైం బావుండి హైదరాబాద్ కు టికెట్... Continue Reading →

నా బొమ్మకు పేరు పెట్టాలి …

బొమ్మలకు కూడా ఎక్స్ ప్రెషన్ లు ఉంటాయని నాకు దీనిని చూసిన తరువాతే తెలిసింది.  ఎందుకో చూడగానే నచ్చేసింది.  ఇది ఏంటో నాకు తెలియదు. ముళ్ళ పందిలా జుట్టు ఉంది, కాని అది కాదేమో.  ఆ కళ్ళు చూస్తుంటే ఏదో అమాయకత్వం, భయం ... ఏమీ అర్థం కానట్లు.  అందుకీ దీనికి ముద్ద పప్పు అని పేరు పెట్టేసాను.  ఎలా చూస్తుందంటే మనకు ఏమి అర్థం కానప్పుడు కళ్ళప్పగించి చూస్తామే అలా ...

చెప్పడం కష్టమే ?

కొంతమంది ఎందుకు నచ్చుతారో చెప్పడం కష్టమే.  వాళ్ళ బిహేవియర్, అందం కూడా మనకు నచ్చే విషయాలలో పార్ట్ కావచ్చు.  మరీ అంత అందం లేకపోయినా నచ్చొచ్చు. నాకు ఒక జబ్బు ఉంది. ఎవరయినా అమ్మాయి కనిపిస్తే ఆకారాన్ని బట్టి జంతువులు గుర్తుకొస్తూ ఉంటాయి. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం,  జాబు లో జాయిన్ అయిన కొత్తలో ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఆన్సర్ షీట్స్ ఇస్తున్నారు. ఒకమ్మాయి పేరు పిలిచాడు. ఆ అమ్మాయి లేచి తీసుకోవడానికి వెళ్ళింది. ఆ అమ్మాయిని... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑