కొంతమంది ఎందుకు నచ్చుతారో చెప్పడం కష్టమే. వాళ్ళ బిహేవియర్, అందం కూడా మనకు నచ్చే విషయాలలో పార్ట్ కావచ్చు. మరీ అంత అందం లేకపోయినా నచ్చొచ్చు.
నాకు ఒక జబ్బు ఉంది. ఎవరయినా అమ్మాయి కనిపిస్తే ఆకారాన్ని బట్టి జంతువులు గుర్తుకొస్తూ ఉంటాయి. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం, జాబు లో జాయిన్ అయిన కొత్తలో ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఆన్సర్ షీట్స్ ఇస్తున్నారు. ఒకమ్మాయి పేరు పిలిచాడు. ఆ అమ్మాయి లేచి తీసుకోవడానికి వెళ్ళింది. ఆ అమ్మాయిని చూస్తే నాకు సీ హార్స్ గుర్తుకు వచ్చింది. ఈ సీ హార్స్ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. జడ అయితే నడుము వరకూ ఉంటుంది. ఎందుకో నాకు తెలియదు కాని, పొడుగు జడ ఉన్న గుర్రాలంటే నాకెందుకో ఇష్టం. ఈ సీ హార్స్ ను ఇష్టపడడం మొదలెట్టాను. ఒకసారి ఏమయిందంటే ఈ సీ హార్స్ వైలెట్ కలర్ చీర కట్టుకుని వచ్చింది. ఎప్పుడూ ఈ నీటి గుర్రాన్ని చీరలో చూడలేదు కదా, ఫ్లాట్ అయిపోయాను. ఈ నీటి గుర్రానికి ఒక మట్టగడస ఫ్రెండ్ ఉంది. చెత్త చేప. ఏదో ఒక సందర్బంలో నేను అన్న మాటలు నా సీ హార్స్ తో చెప్పింది. కొన్ని చెత్త సలహాలూ ఇచ్చింది. మొదట్లో బానే ఉన్న నా సీ హార్స్ మాట్లాడడం మానేసింది. కొంతకాలానికి వాడెవడో వల వేసి పట్టుకుపోయాడు. ఆ మట్టగడస కు కూడా పెళ్లి అయిపోయింది.
నేనేమీ దేవదాసును కాను కదా, ప్రతి చేపకు ఎవరితో పెళ్లి కావాలో ఆ దేవుడు పుట్టినపుడే రాసేస్తాడు. పైగా మన జాతకం లో గురుడు, చంద్రుడు ఎప్పుడూ కలసి లేరు. సో, మనకు ప్రేమ అచ్చి రాదు. నాకు తెలుసు ఈ మట్టగడస మాటలు, సీ హార్స్ బ్రెయిన్ ను ప్రభావితం చేయనప్పటికీ ఎందుకో నాకు చిరాకు. నా సీ హార్స్ పౌర్ణమి చందమామ కానప్పటికీ నాకెందుకో అదో ఇది …

Mitrama..
nee bhadha ardham chesukonnanu.
Naadoka small salaha.
Ee pichhi blogs raase badulu try to flirt a girl around your place.
Moksham kalige loga muddu ayina dorukutundi.
Dorikithe Full moon, dorakaka pothe Half moon. Cheera kadithe chaaalu …see horse lu gurtu vastaayi.
Mee magallu ee Janmaki maararu. Ekkado water lo vunna Sea horse ni kooda vadilipettadam ledu ante meeru octopus ayyi vuntaru. Future lo inka enni vankara pranulu choodavalasi vastumdo?? Ha ha
oka ammayi jada… kallu chusi padipoyava babu??? hahahaha… idemi reel wrld kadu kada…real wrld.so be practical mitrama.