ఈ సంవత్సరం సంక్రాంతి ఏదో అలా, అలా గడచిపోయింది. ఇంటికెళ్ళి ఉంటే బావుండేది. ఆ భోగి మంటలు, బంతి పూలు, లంగా వోణి అమ్మాయిలు, పాపి కొండలు ట్రిప్ … అన్నీ చూసి ఉండేవాడిని … కాని మా టీం మేట్ పెళ్లి కేరళలో ఉంది. ఆఫీసుకి ఒకరోజు డుమ్మా కొట్టేసి నాలుగు రోజులు కేరళలో ఉందామని ప్లాన్. చెత్తలాగా నాతొ వచ్చేవాడు హ్యాండ్ ఇచ్చేసాడు. ఇక నేనూ వెళ్ళలేదు. టైం బావుండి హైదరాబాద్ కు టికెట్ దొరికింది. కాని అన్నీ కష్టాలే. బస్సోడు ఎక్కడికో రమ్మన్నాడు. ఆటోవాడు ఎక్కడికో తీసుకెళ్ళాడు. హిందీ మాట్లాడడం సంగతి అలా ఉంచితే, అర్థం కావడం కూడా కష్టమే … తెత్తేతే … మెమెమ్మే … గంట సేపు చలిలో నిల్చుంటే మొత్తానికి వచ్చాడు … సీటులో కూర్చున్నాను … కొంతసేపు వీపు మీద దురదలు మొదలయ్యాయి … దోమలేమో అనుకున్నాను. ఓకే, ఇవి కూడా హైదరాబాద్ వస్తున్నాయేమో అనుకుని ఊరుకున్నాను. కొంతసేపటికి బస్సులో గోల, గోల. అందరూ దురదలు, దురదలు అంటూ అరవడం మొదలెట్టి, డ్రైవర్ మీద అరుస్తున్నారు. అప్పుడు ఆడు చల్లగా చెప్పాడు … అవి నల్లులు కావచ్చేమోనని … సీట్ల మీద ఏదో స్ప్రే చేసి నల్లులను నిద్రపుచ్చేసాం … తెల్లవారు జామున మూడు గంటలకు అనుకుంటా మెలకువ వచ్చేసింది … చూస్తే బస్సు ఆగిపోయి ఉంది … యాక్సిడెంట్ యిది ముందు … ఒక గంటన్నర జామ్ … మొత్తానికెలాగో వచ్చేటప్పటికి తొమ్మిది అయింది.
‘మిరపకాయ్ ‘ చూసేసా భోగి రోజు … బేసిక్ గా నేను రవితేజ ఫ్యాన్ ను కానప్పటికీ తన సినిమాలు కొన్ని బావుంటాయి … నాకు నచ్చేసింది … ఇంటర్వల్ అప్పుడే వచ్చేసిందా అనిపించింది. కాని సినిమా మొత్తం అయ్యేటప్పటికి కొంచం పెద్దదిగా అనిపించింది. సినిమా చూసి ఊరుకుంటే పరవాలేదు కాని, హీరో ప్లేసులో మనల్ని ఊహించుకుంటేనే ప్రాబ్లం … ఆ సాయంత్రానికి నా బ్యాగ్ లోకి మూడు కొత్త షర్టులు వచ్చాయి. సినిమా మొత్తం కలర్ ఫుల్ గా ఉంది. పాటలు ఓకే. కామెడి ఓకే.
నెక్స్ట్, ‘అనగనగా ఒక ధీరుడు’ … వెళ్లేముందు నరేంద్ర అన్నాడు … కార్టూన్ సినిమాలు ఏం చూస్తావు అని … కాని, అంత పెద్ద డిస్నీ తెలుగు లో సినిమా తీస్తుంది … ఎలా ఉంటుందో అన్న ఇది ఉంటుంది కదా … ఎందుకో అంత నచ్చలా … నేను మాత్రం శృతి హాసన్ ఎప్పుడొస్తుందా అనే చూసాను … అందంగానే చూపెట్టాడు … మా పవన్ గాడు చెప్పాడు … కమల్ హాసన్, సారిక ల ప్రోడక్ట్ కదా, అలానే ఉంటుంది మరి అని … సినిమాను ఇంకొంచం బాగా తీయోచ్చేమో … అంతా మోహన్ బాబు కూతురు, సిద్దార్థ్ లనే చూపెట్టాడు. నిన్న ఏదో చానెల్ లో వచ్చిన ప్రోగ్రాంలలో కూడా చెత్తలాగ అంతా ఈ సిద్దార్థ్ యే మాట్లాడాడు. ఈ అమ్మాయికి చాన్స్ ఇవ్వలేదు.
ఇక, గోల్కొండ హై స్కూల్ … నేనేయితే దీనికి టైం ను చంపెయ్యడానికే చూసాను. బానే ఉంది.
అదీ … నచ్చనిది ఏంటంటే పండగ అంతా ఈ సినిమాలతోనే అయిపోవడం. ఇంటికెళ్ళి ఉంటే బావుండేది. సండే ‘శివ శివ శంభో’ కూడా చూసేసాను. నాకు ట్రాజెడీ సినిమాలు ఇష్టం ఉండవు. అందుకు ఇంతకుముందు చూడలేదు. కాని చాలా బావుంది. తమిళ్ లో ఇది హిట్ అట. తెలుగులో ఫ్లాప్. ఫ్రెండ్స్ ప్రేమ కోసం లైఫ్ ను రిస్క్ చేయడం. నచ్చింది. వచ్చే సంవత్సరం అయినా కొత్త, కొత్తగా జరుపుకోవాలి.


Leave a comment