సరిగా ఐదు సంవత్సరాల క్రితం …

నేను జాబు లో జాయిన్ అయి ఇవ్వాల్టికి సరిగ్గా ఐదు సంవత్సరాలు … అయ్యబాబోయ్ … ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదోలా అనిపిస్తుంది … ఏ విషయంలో అయినా  ‘మొదటి’ కి ప్రత్యేక స్థానం ఉంటుందనుకుంటాను … మనం సాధించింది ఏమన్నా ఉందా అని ఆలోచిస్తే ‘లేదు’ అన్న సమాధానం వస్తుంది … అయినా ఏమి చెయ్యాలి ?

అంతకు వారం రోజుల ముందే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యాయి … పండక్కి ఇంటికి వెళ్ళి వచ్చి ఇక్కడ దిగాను … నేను, హరిగాడు ఆటోలో దిగాం … అప్పటికే సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఆ రోజున జాయిన్ అవుతున్న ముప్పై రెండు మంది పేర్లు ఉన్నాయి … మా దగ్గర ఆఫర్ లెటర్స్ వెరిఫై చేసి లోపలికి పంపించాడు … అప్పటికే ఇద్దరు అందమయిన అమ్మాయిలు  కూర్చున్నారు … నేను, మా హరిగాడు వాళ్లకు ఎదురుగా కూర్చున్నాం … పలకరించుకోలేదు గాని … నేను ఆ ఇద్దరిలో పొట్టి అమ్మాయినే చూస్తున్నాను … దేవుడు కొంచం పొడుగ్గా పుట్టించొచ్చు కదా ఈ అమ్మాయిని అనుకున్నాను … కొంతసేపటికి అందరూ వచ్చేశారు … ఎవరికి వారు బాచ్ లుగా విడిపోయారు … ఇంట్రడక్షన్,  బ్యాంకు ఎకౌంటు ఓపెన్ చెయ్యడం,  ఆఫీసులో  అటూ, ఇటూ తిరగడం … అలా, అలా గడచిపోయింది … పెద్దగా ఎవరినీ పలకరించలేదు …

మా బాచ్ లో దాదాపు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి … ఒక లవ్ మారేజ్ కూడా … రెండోది కూడా ‘ఆన్ ది కార్డ్స్’ … చెత్త లాగ నేనూ ఉన్నాను … ఒక లవ్వు లేదు, ఒక పెళ్లి లేదు …

One thought on “సరిగా ఐదు సంవత్సరాల క్రితం …

Add yours

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑