లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది. ఏమి చేద్దాం అని ఆలోచిస్తుంటే వై.హెచ్.ఏ.ఐ గుర్తుకొచ్చింది. వెంటనే http://www.yhaindia.org/ కొట్టాను. మే లో హిమాచల్ ప్రదేశ్ లో మనాలి దగ్గర నుండి పది రోజులు ట్రెక్కింగ్ ఉంది. వెంటనే బుక్ చేసేసాను. ఫీ కేవలం మూడు వేలు మాత్రమే. ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్లి, అక్కడ నుండి సిమ్లా కు బస్సులో వెళ్ళాలి అని ప్లాన్. ఆఫీసులో సెలవు ఇస్తారా, లేదా అన్న భయం పట్టుకుంది. కాని, ఇప్పుడు ట్రెక్కింగ్ ను మిస్ అయితే చాలా, చాలా కష్టం. అందుకే ఎట్టి పరిస్థితులలోను వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను.
నెట్ లో వెతికితే కొన్ని ఫోటోస్ దొరికాయి. వాటిని చూస్తున్న కొద్దీ బాగా ఎక్సైట్ అవుతున్నాను.
అమ్మ నన్ను తిట్టడం మొదలెట్టింది. అవును మరి, తనను చూసి ఇదు నెలలు దాటుతుంది. పది రోజులు సెలవు పెట్టి, ఇంటికి వెళ్ళకుండా హిమాలయాల చుట్టూ తిరుగుతుంటే తిట్టదా మరి ???
పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టి చాల కాలం అయ్యింది. ఒక్క అమ్మాయి కూడా సెట్ అవ్వలేదు. ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకోవాలి కాని, ఎక్కడికో పోతాను అంటావేంటి అని ఒకటే గోల !!!


chandhamama raasi peeti vundhi…
Pournami kosam wait chayyali ….
Baagaa cheppaaru..
All the best for your trip and for Your Chandhamaama.