మొత్తానికి కొకండివా ట్రెక్ బానే కంప్లీట్ చేసాము. బావుంది. ఒక రోజే. అసలు ఈ ట్రెక్ గురించి ఎలా తెలిసిందంటే, గూగుల్ లో సెర్చ్ చేసాను, పూణే లో ట్రెక్కింగ్ క్లబ్స్ ఏమున్నాయి అని ... http://www.giridarshan.com/ కనిపించింది. సైట్ బావుంది, ప్రతి వారం ఏదో ఒక ప్లేస్ కి ట్రెక్ ఉంది ... ఈ వారం కోకండివా అన్న కొండమీదకి. ఒక రోజు ట్రెక్. సరే అని, డబ్బులు పే చేసాను. ఆదివారం ఎప్పుడు వస్తుందా అని... Continue Reading →
హుర్రే … కొట్టేసాం … గెలిచేసాం …
అద్భుతం ఈ విజయం ... సచిన్ అయిపోగానే భయమేసింది. కాని, గంభీర్, ధోని భలే ఆడారు. మలింగా బౌలింగ్ కు రాగానే మళ్ళీ భయం వేసింది. అన్ని యార్కర్లు వేస్తున్నాడు. ధోని బాగా ఆడాడు. రెండు ఫోర్లు కొట్టాడు. విన్నింగ్ షాట్ కేక. ఇరవై ఎనిమిది సంవత్సరాల తరువాత గెలిచాం. మళ్ళా ఎప్పటికో ? అప్పటికి సచిన్ ఉండడు. గెలిచినా, ఈ కప్పుకు ఉన్న ఇది దానికి ఉండదు.
అతడెంత ఎదవో అతడికే తెలీదు …
మధ్యాహ్నం రెండు అవుతుంది. అపుడపుడే చలి తగ్గి వాతావరణం వేడెక్కడం మొదలెట్టింది. అతడు పొడుగ్గా, కొంచం సన్నగా, అందంగా ఉన్నాడు, ఇంగ్లీష్ మాట్లాడుతాడు. నీలి రంగు జీన్స్ పైన, నలుపు రంగు షర్టు వేసుకున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చి, లిఫ్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. లిఫ్ట్ డోర్ దాదాపు మూసుకుంటాయి అనగా తెరచుకున్నాయి. ఇద్దరు అమ్మాయిలు లోపలి వచ్చారు.
గోపాలరావు గారి హోటల్ – ఉగాది పచ్చడి
ఉగాది వచ్చింది కదా, పచ్చడి గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు మేము అందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం. అందరం అంటే మా చిన్నాన్నలు, పిన్నులు, వాళ్ళ పిల్లలు, మామలు (తాతలు ఎప్పుడో పోయారు) . అంటే ఉమ్మడి కుటుంబం కాదు గాని, ఒకే చోట ఉండేవాళ్ళం. ఎప్పుడు ఉగాది వచ్చిన ఆనవాయితీ లేదు మనకు అని చెప్పి పచ్చడి ఎప్పుడూ చేసేవారు కాదు. మా ఇంట్లో మామిడి చెట్లు, వేప చెట్లు బానే ఉండేవి. వేప చెట్టు విరగ... Continue Reading →