మొత్తానికి కొకండివా ట్రెక్ బానే కంప్లీట్ చేసాము. బావుంది. ఒక రోజే. అసలు ఈ ట్రెక్ గురించి ఎలా తెలిసిందంటే, గూగుల్ లో సెర్చ్ చేసాను, పూణే లో ట్రెక్కింగ్ క్లబ్స్ ఏమున్నాయి అని … http://www.giridarshan.com/ కనిపించింది. సైట్ బావుంది, ప్రతి వారం ఏదో ఒక ప్లేస్ కి ట్రెక్ ఉంది … ఈ వారం కోకండివా అన్న కొండమీదకి. ఒక రోజు ట్రెక్. సరే అని, డబ్బులు పే చేసాను. ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాను. ఆదివారం ఉదయం 6.15 కల్లా గిరి దర్శన్ ఆఫీసుకు రావాలి అన్నారు. ఉదయం నాలుగు గంటల కల్లా నిద్ర లేచాను. 4.20 కి బయలుదేరాను. ముప్పై కిలోమీటర్లు. 5 కల్లా రైల్వే స్టేషన్ లో పార్క్ చేసి, ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికి 5.15 అయ్యింది. అందరూ వచ్చి, బయలుదేరటప్పటికి 7.
ఒక ఇరవై మందిమి ఉంటాం. అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. అరే, అందరికీ భలే ఇంటరెస్ట్ ఉందే అనుకున్నాను. బేస్ విలేజ్ పూణే నుండి కనీసం 70 కిలోమీటర్లు ఉంటుంది. రెండు గంటల ప్రయాణం. ఒక టెంపో లో, ఒక సుమో లో చేరుకున్నాం. ఆ దారి అద్బుతం. చుట్టూ కొండలు, నీరు. అసలే ఉదయం ఏమో, ఎండ లేదు. పరిచయాలు అయినాయి. బయలుదేరే ముందు చత్రపతి శివాజీ ని తలచుకున్నాం. అది ఒక పద్యం లాగా ఉంది. ‘జై భవాని, జై శివాజీ, హర హర మహాదేవ శివాజీ మహారాజ్ కీ జై’ అని. వినగానే భలే అనిపిస్తుంది. రోమాలు ఒక్కసారి నిక్కబొడుచుకుంటాయి. మొదలెట్టాం. మొదట్లో ఈజీ గానే ఉంది. నేను రెండు లీటర్లు నీరు, అరటి పళ్ళు, రెండు ఆపిళ్ళు, పెరుగన్నం తీసుకు వెళ్లాను. తిరిగి వచ్చేవరకూ నీరు దొరకదు అని దాహం వేసినపుడల్లా కొంచం, కొంచం తాగుతున్నాను. దాదాపు అందరూ మరాఠీ లే. ఒక్కడు కూడా హిందీ లో మాట్లాడడం లేదు. నేను ఒక్కడినే మూగగా, ప్రకృతి తో మాట్లాడుతూ నడుస్తున్నాను. బావుంది.
ఇక్కడకు వచ్చే ముందు భయం వేసింది. అసలే వేసవి. విపరీతమయిన ఎండ. ఇక్కడకు రావడం మంచిదేనా అని. కాని వచ్చేసా !! మధ్యలో ఒక చిన్న ఊరు, అంటే మూడు, నాలుగు ఇళ్ళు ఉన్న ప్రదేశం కనిపించింది. అక్కడ నీరు నింపుకుని బయలుదేరాం. ముందు రెండు గంటలు అంత అలసట తెలియలేదు. అంత ఎత్తున ఉండ కొండలను చూస్తే భలే ఆనందం వస్తుంది. ఈ కొండలు దూరం నుంచి చూస్తే చిన్నవిగా కనిపిస్తాయి గాని, ఎక్కుతున్నపుడు తెలుస్తుంది మజా. చుట్టూ తిరుగుతూ వెళ్ళాలి.
ఇక్కడ వరకూ బాగానే ఉంది కాని, అసలు పండగ ముందుంది. ఎందుకంటే ఎవరి దగ్గరా నీరు లేదు. ఓపిక లేదు. కనీసం మూడు గంటలు నడవాలి. కాళ్ళు ఈడ్చుకుంటూ, దిక్కులు చూస్తూ రాత్రి ఏడు కల్లా క్రిందకు చేరుకున్నాం. అక్కడ నుండి పూణే కు వచ్చి, రూం కు వచ్చేటప్పటికి రాత్రి పదకొండున్నర అయింది.
మొత్తానికి, ఇది ఒక అద్బుతమయిన అనుభవం.
Very nice. lucky you!